తనపై ఉన్న పలు విమర్శలకు బ్రేక్ వేసిన మహేష్ బాబు...!?
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆత్రుత హీరోయిన్లలో ఎక్కువగా ఉంటుంది. హీరోలతో పోలిస్తే హీరోయిన్ల చిత్రజీవిత కాల పరిమితి చాలా తక్కువ అవటమే అందుకు కారణం. అగ్ర హీరోలతో జంటగా నటించినవారు త్వరలోనే వారికి తల్లి, వదిన, అత్త పాత్రలలోకి ఒదిగిపోవటానికి సిద్ధపడాల్సివస్తుంది. కానీ హీరో ఎంత పెద్దయినా హీరోయే. అందువలన హీరోయిన్లు సామాన్యంగా అవకాశాలను వదులుకోరు మరీ వాళ్ళ ఇమేజ్ కి భిన్నంగా ఉండి, దానివలన సినిమా అవకాశాలు రావేమో అనే భయం ఉంటే తప్ప.
కానీ మహేష్ బాబు విషయంలో కూడా ఈ సూత్రం పనిచేస్తోంది. అందుకు కారణం ఏమిటో అర్థం చేసుకోవటం చాలా సులభం. చాలా బద్దకస్తుడనీ, ప్రతీ సినిమాకు చాలా టైమ్ తీసుకుంటాడని..ఇలా తనపై ఉన్న పలు విమర్శలకు బ్రేక్ వేశాడు. అంతకు ముందు తాపీగా సినిమాలను పూర్తి చేసుకునే మహేష్ బాబు ఇప్పుడు చకచకా పూర్తి చేస్తూ, కొత్త సినిమాలకు ఒప్పందాలు చేసుకోవటంలో బిజీ అయ్యారు. స్టార్ డమ్ పరంగా తెలుగు చిత్ర పరిశ్రమకి తదుపరి నంబర్ వన్ కాగతల సత్తా ఉన్నప్పటికీ మహేష్ స్లోగా సినిమాలు చేస్తాడనే విమర్శ ఒక్కటే అతనికి మైనస్ గా మారింది. అయితే దానిని కూడా సరిదిద్దుకుంటూ వచ్చే ఏడాది చివరికల్లా మొత్తం మూడు సినిమాలు పూర్తి చేసే విధంగా మహేష్ పక్కా ప్రణాళిక సిద్దం చేసుకున్నాడు.
బిజినెస్ మ్యాన్ షూటింగ్ ఆల్ మోస్ట్ పూర్తి కాగా, క్రిష్ దర్శకత్వంలో వెంకటేష్ తో కలిసిన నటిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" జనవరిలో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏప్రిల్ కి సుకుమార్ డైరెక్షన్ లో చేసే చిత్రం మొదలవుతుంది. ఇవి కాక మహేష్ అంగీకారం ఎదురు చూస్తున్నదర్శకులు..కరుణాకరన్, రోబో శంకర్, మురుగదాస్ మణిరత్నం....ఇలా దర్శకుల జాబితా పెద్దదే ఉంది. గత నాలుగేళ్లలో కేవలం రెండే సినిమాలు చేసిన మహేష్ వి వచ్చే ఏడాదిలోనే మూడు సినిమాలు విడుదల కానుండడం విశేషమే మరి.


Click it and Unblock the Notifications











