దూకుడు స్పందనకు ప్రిన్స్ వెరీవెరీ హ్యాపీ..!
భారీ అంచనాల మధ్య ఈ రోజు విడుదలైన 'దూకుడు" సినిమా హిట్ కొట్టింది. ఈ రోజు ఉదయం నుండే సినిమా థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. ఈ సినిమా విడుదలకు ముందే పాజిటివ్ రిపోర్ట్ తెచ్చుకొన్న విషయం విధితమే. ఇంత వరకూ టాలీవుడ్ లో ఏ సినిమాను ఇన్ని అత్యధిక ప్రింట్లతో విడుదల చెయ్యలేదు. దూకుడు సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
పోకిరి చిత్రం తర్వాత సరైన విజయం కోసం ఎదురుచూసిన మహేష్ కు దూకుడు చిత్రం కాస్త సంతృప్తినే ఇచ్చినట్టుగా అనిసిస్తుంది. మహేష్ చెప్పే డైలాగులకు థియేటర్లలో అభిమానులు పండగా చేసుకుంటున్నారు. అయితే మహేష్ గత అన్ని సినిమాలు కూడా సంగీతం పరంగా ప్రధానాకర్షణగా నిలిస్తుండేది. అయితే ఈ చిత్రంలో రెండు పాటలు హైలెట్ గా ఉన్నాయి. మరి మహేష్ నిన్న ఫ్యామిలీతో కలిసి సినిమా చూసి చాలా బాగవచ్చిందని హ్యాపీగా చెప్పారు. మరి ఈ రోజు ఫ్యాన్స్ తో కలిసి సినమా చూసి ఫ్యాన్స్ కేరింతలకు చాలా హ్యాపీగా ఫీలయ్యాడు...సో మరి కలెక్షన్స్ పరంగా పోకిరి నీ దాటుతుందో లేదో వేచి చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











