ప్రిన్స్ మహేష్ ని పడగొట్టాలంటే ఒకటే దారి...అదే జేమ్స్ బాండ్...
ఖలేజా సినిమాతో రికార్డులు తిరగరాస్తానని ప్రగల్సాలు పలికిన మహేష్ బాబు బొక్కబోర్లా పడ్డాడు. మూడేళ్ల అజ్జాతవాసం చేస్తే జనం తన సినిమాకి బండ్లు కట్టించుకుని వచ్చేస్తారని అనుకున్న మహేష్ బాబుకి ఈ మూడేళ్ల లో జనం తనని బొత్తిగా మర్చిపోయారనే సంగతి బోధపడింది. మళ్లీ పోకిరిలాంటి హిట్టస్తే తప్పు తను రియల్ సూపర్ స్టార్ అనిపించుకోలేనని మహేష్ కి అర్థమయింది. అయితే ఆ సినిమా ఎప్పుడొస్తుందనేదే అతనికి అర్థం కావట్లేదు.
ప్రస్తుథం చేస్తున్న 'దూకుడు" పై కూడా మహేష్ అంచనాలు లేవు. త్రివిక్రమ్ లానే కామెడీ చేసుకొని హిట్ కొట్టాలని చూసే దర్శకుడు కాబట్టి శ్రీను వైట్ల మీద మహేష్ నమ్మకం పెట్టుకోవడం లేదు. అల్లాటప్పా సినిమాలు చేస్తే రికార్డులు రావని తెలుసుకున్న మహేష్ జేమ్స్ బాండ్ తరహా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. తనని సంప్రదించిన అందరు దర్శకులతోనూ ఈ కోరికే చెబుతున్నాడు.
మహేష్ తో సినిమా చేద్దామని అనుకుంటోన్న పూరి జగన్నాథ్, మెహర్ రమేష్ కి కూడా అలాంటి కథ రెడీ చేయమని మహేష్ చెప్పాడు. ముందుగా ఎవరు అలాంటి కథతో వెళితే వారి ట్రాప్ లో పడిపోవడానికి మహేష్ రెడీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











