Acharya కోసం మహేష్‌బాబు వాయిస్ ఓవర్ ఎందుకంటే.. బలమైన కారణం చెప్పిన కొరటాల శివ
మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన ఆచార్య సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై రోజురోజుకు అంచనాల స్థాయి అమాంతంగా పెరిగి పోతున్నాయి. ఇక రీసెంట్ గా మహేష్ బాబు కూడా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు చిత్ర యూనిట్ సభ్యులు అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వడంతో సినిమా పై మరింత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి. అయితే మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ చెప్పించడానికి ఒక బలమైన కారణం ఉంది అని దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చాడు.

మరో మంచి కాన్సెప్ట్..
వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును అందుకున్న కొరటాల శివ ఈసారి మరో మంచి సందేశాత్మక చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి అలాగే రామ్ చరణ్ తేజ్ తో తెరకెక్కించిన ఆచార్య సినిమా ఒక డిఫరెంట్ యాక్షన్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో హిందూ దేవాలయాలకు సంబంధించిన ఒక అంశాన్ని హైలెట్ చేసినట్లు సమాచారం.

బలమైన కారణం..
మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ తేజ్ కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు అనగానే సినిమాపై ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. ఇక ఈ సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కేవలం ఈ సినిమాకు హైప్ క్రియేట్ చేయడానికి మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ ఇప్పించలేదట. అందుకు ఒక బలమైన కారణం అన్నట్లుగా దర్శకుడు తెలియచేసాడు.

ఇంట్రెస్టింగ్ స్టోరీ
ఆచార్య సినిమా మొదలవగానే ధర్మస్థలి అనే టెంపుల్ టౌన్ కు సంబంధించిన ఒక బ్యాక్ డ్రాప్ స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుందట. అయితే రెండు నిమిషాల ఆ చిన్న కథతోనే ప్రేక్షకులు సినిమా కథలోకి తీసుకువెళ్లాలట. ధర్మస్థలి ప్రాంతంలో అమ్మవారు ఎలా వెలిసారు.. అలాగే ఈ నగరం ఎలా ఆవిర్భవించింది అనే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుందట.

అందుకే మహేష్ బాబుతో..
సినిమా మొదటి రెండు నిమిషాల్లో చాలా ముఖ్యం కాబట్టి ఆ కథ చెప్పినప్పుడు ప్రతి ప్రేక్షకుడు ఎంతో ఆసక్తిగా వినాలి అని ఒక మంచి ఇమేజ్ ఉన్న హీరో తో వాయిస్ ఓవర్ చెప్పించాలి అని అనుకున్నాము అంటూ.. అంతే కాకుండా వాయిస్ లో చాలా నిజాయితీ ఉండాలి అని అనుకున్నప్పుడు మహేష్ బాబు అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అని ఆ నిర్ణయం తీసుకున్నట్లు గా కొరటాల తెలియజేశాడు.

అలా అడగగానే..
మహేష్ బాబుతో ఆచార్య సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వాలని అడిగిన వెంటనే ఎలాంటి ఆలోచనలు లేకుండా ఒప్పుకున్నారు. స్క్రిప్ట్ వింటారా అని అడిగినప్పుడు కూడా ఆయన అలాంటిదేమీ లేదు అని తప్పకుండా చాలా కరెక్ట్ స్క్రిప్టు సెలెక్ట్ చేసుకొని ఉంటారు అని ఆయన అన్నారు. ఇక మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన విధానం ఎంతో అద్భుతంగా ఉంది అంటూ ఆయన అలా చెప్పగానే ప్రతి ఒక్కరు కూడా కథలోకి వెళ్ళిపోతారు అని.. సినిమాకు అడిగిన వెంటనే వాయిస్ ఓవర్ ఇచ్చిన మహేష్ బాబు కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు కొరటాల శివ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











