ఆ సీన్స్ నేను ఒప్పుకోను: మహేష్ బాబు
'ది ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్' అనే పుస్తకం చదివి, నేను సిగరెట్లు కాల్చడం మానేశాను. ఈ పుస్తకం చదివి నాలుగేళ్లయ్యింది. ఈ నాలుగేళ్లల్లో నేను సిగరెట్ జోలికెళ్లలేదు. నా సినిమాల్లో కూడా సిగరెట్ కాల్చే సీన్స్ ఒప్పుకోను. 'బిజినెస్‌మేన్'లో నేను చేసిన సూర్యాభాయ్ పాత్ర సిగరెట్ కాల్చితే బాగుంటుందనుకున్నాం. కానీ దాన్ని ఎవరైనా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునే ప్రమాదం ఉందనిపించి, విరమించుకున్నాం. స్మోకింగ్ చాలా హానికరం. ఏ టాప్ హీరో కూడా దాన్ని ప్రమోట్ చేయకూడదన్నది నా ఫీలింగ్ అంటూ చెప్పుకొచ్చారు మహేష్ బాబు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...తాను చదివిన పుస్తకాల్లో పర్శనల్ గా మార్పు తెచ్చిన పుస్తకం గురించి చెపుతూ ఇలా స్పందించారు.
అలాగే తాను వీలు కుదిరినప్పుడల్లా పుస్తకాలు చదువుతానని అన్నారు. ఇక ఇతర భాషా చిత్రాల్లో నటించటం పై మాట్లాడుతూ..మిగతావాటితో పోలిస్తే మన తెలుగు సినిమా మార్కెట్ ఏమీ తక్కువ కాదు. తెలుగు సినిమాల్లో నటిస్తున్నందుకు గర్వంగా ఉంది. అందుకే నేను ఇతర భాషలపై దృష్టి పెట్టడంలేదు. ఒకవేళ మంచి కథ.. అది కూడా మణిరత్నంలాంటి దర్శకులు అడిగితే అప్పుడు తమిళ్‌లో నటిస్తా. ఆ మధ్య మా కాంబినేషన్‌లో ఒక సినిమా అనుకున్నాం కానీ మిస్ అయ్యింది. అలాగే శంకర్ దర్శకత్వంలో కూడా సినిమా మిస్ అయ్యింది. అందుకు బాధ అనిపించింది అన్నారు. బిజినెస్ మ్యాన్ విజియోత్సాహంలో ఉన్న మహేష్ ..త్వరలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











