twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు వదులుకున్నాడు....అలీ హీరో అయ్యాడు!

    |

    హైదరాబాద్: బాలనటుడిగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అలీ క్రమక్రమంగా పాపులర్ తెలుగు కమెడియన్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. కమెడియన్‌గా కొనసాగుతూ...'యమలీల' చిత్రంతో హీరోగా మారాడు అలీ. అలా హీరోగా మారిన అలీ ఇప్పటి వరకు 50 చిత్రాల్లో హీరోగా నటించారు. ఆయన 50వ చిత్రం 'అలీ బాబా ఒక్కడే దొంగ' ఈ నెల 21న విడుదలవుతోంది.

    సినిమా విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడిన అలీ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. తాను మొదట హీరోగా నటించిన సినిమా 'యమలీల' వాస్తవానికి మహేష్ బాబు నటించాల్సిన సినిమా అని, ఆయన ఆ సినిమాను వదులుకోవడం వల్ల నాకు అవకాశం వచ్చిందని తెలిపారు.

    అప్పట్లో మహేష్ బాబు తండ్రి కృష్ణ అంగీకరించక పోవడం వల్లనే ఆయన ఆ సినిమా చేయలేదని, ఈ క్రమంలో ఆ సినిమాలో నాకు నటించే అవకాశం వచ్చిందని అలీ తెలిపారు. అలా హీరోగా మొదలైన నా ప్రస్థానం ఈ నెల ఏప్పిల్‌తో 20 సంవత్సరాలు పూర్తవుతుందని అలీ చెప్పుకొచ్చారు.

    నటుడిగా అలీ దాదాపే మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు అలీ 1000కి పైగా చిత్రాల్లో నటించారు. అయితే హీరోగా మాత్రం ఆయనకు 'అలీ బాబా ఒక్కడే దొంగ' 50వ చిత్రం. ప్రస్తుతం అలీ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు.

    ఇంటర్వ్యూలో తానే హీరోగా మారిన పరిస్థితులపై అలీ మాట్లాడుతూ...'యమలీల' చిత్రం 1994లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చింది. దర్శకుడు తొలుత ఈచిత్రాన్ని మహేష్ బాబుతో చేయాలని ప్లాన్ చేసారు. అప్పటికి మహేష్ బాబు హీరోగా తెరంగ్రేటం చేయలేదు. ఈ సినిమాతో ఆయన్ను హీరోగా పరిచయం చేద్దామని ఎస్వీ కృష్ణారెడ్డి భావించారు.

    మహేష్ బాబు ఫాదర్ కృష్ణ గారికి 'యమలీల' స్టోరీలైన్ చెప్పారు. ఆయనకు స్టోరీ ఎంతగానో నచ్చింది. కానీ మూడేళ్లు వెయిట్ చేయమని చెప్పారు. దీంతో దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి నన్ను సంప్రదించారు. అలా నాకు హీరోగా అవకాశం వచ్చింది. తొలుత ఈచిత్రానికి 'యమస్పీడు' అనే టైటిల్ అనుకున్నాం. ఆ తర్వాత 'యమలీల'గా మార్చాం అని అలీ చెప్పుకొచ్చారు.

    స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు....

    యమలీల స్టోరీ

    యమలీల స్టోరీ


    యమలీల చిత్రం మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్. మదర్ సెంటిమెంటుతో ఈచిత్రం నడుస్తుంది. తన తల్లి కోల్పోయిన వైభవాన్ని, రాయల్ లైఫ్ మళ్లీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన కొడుకు కథే ఈ చిత్రం.

    యమలీల కామెడీ

    యమలీల కామెడీ


    యమలీల చిత్రంలోని కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. యముడిగా కైకాల సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా బ్రహ్మానందం, విలన్ పాత్రలో తనికెళ్ల భరణి కామెడీ పండించారు.

    యమలీల మేకర్స్

    యమలీల మేకర్స్


    యమలీల చిత్రానికి స్టోరీ, దర్శకత్వం ఎస్వీ కృష్ణారెడ్డి. కిషోర్ రాఠి, కె అచ్చి రెడ్డి నిర్మాతలు. శరత్, కె.రాజేంద్రప్రసాద్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు.

    యమలీల మ్యూజిక్

    యమలీల మ్యూజిక్


    ఈ చిత్రం అప్పట్లో మ్యూజికల్‌గా కూడా మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి సంగీతం కూడా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి అందించడం విశేషం. సినిమాలోని అన్ని పాటలు అప్పట్లో బాగా పాపులర్ అయ్యాయి.

    యమలీల నటీనటులు

    యమలీల నటీనటులు


    ఈ చిత్రంలో అలీ, ఇంద్రజ హీరో హీరోయిన్లుగా నటించారు. కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు ఇతర పాత్రల్లో నటించారు.

    యమలీల బాక్సాఫీసు సక్సెస్

    యమలీల బాక్సాఫీసు సక్సెస్


    అప్పట్లో యమలీల చిత్రం రూ. 75 లక్షలతో నిర్మించారు. ఏప్రిల్ 28, 1994లో విడుదలైంది. బాక్సాఫీసు వద్ద ఈచిత్రం ఘన విజయం సాధించింది.

    English summary
    Telugu comedy actor Ali, who is set to release his solo hero film Alibaba Okkade Donga on February 21, has revealed that Superstar Mahesh Babu was to play the hero in Yamaleela, which happens to be his first film as hero. Since his father Krishna did not give his consent at the moment, the comedian became the hero and he will complete 20 years as a lead actor in Telugu cinema this April.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X