రెండవ తెలుగు నటుడు మహేషే.. సూపర్ హ్యాపీ అంటున్న సూపర్ స్టార్!

Recommended Video

Mahesh Babu Going To Get A Wax Statue At Madame Tussauds

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన అభిమానులు సంతోషంగా ఉండే సమయం ఇది. భరత్ అనే నేను చిత్రం సంచలన విజయం సాధించి కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. మహేష్ బాబు నటనతో అదరగొట్టేసాడు. రాజకీయాలతో తనకు ఇటివంటి ప్రమేయం లేకున్నా మహేష్ ముఖ్యమంత్రిగా ఇరగదీసాడు. కొరటాల శివ రాసుకున్న కథకు అనుగుణంగా మహేష్ ని చూపించిన విధానం అద్భుతమని చెప్పొచ్చు. భరత్ అనే నేను చిత్ర విజయాన్ని ఆస్వాదిస్తున్న తన అభిమానులకు మహేష్ మార్ గుడ్ న్యూస్ చెప్పాడు. మహేష్ అభిమానుల సంతోషాన్ని రెట్టింపు చేసే న్యూస్ ఇది. ప్రఖ్యాత మేడం టుస్సాడ్ మ్యూజియంలో మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని నెలకొల్పబోతున్నారు. ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా వెల్లడించారు.

అరుదైన గౌరవం

అరుదైన గౌరవం

మేడం టుస్సాడ్ మ్యూజియంలో విగ్రహం ఉండడం అంటే అది అత్యంత అరుదైన గౌరవం అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు పలువురు భారతీయ ప్రముఖుల మైనపు విగ్రహాలు మేడం టుస్సాడ్ మ్యూజియంలో నెలకొల్ప బడ్డాయి.

రెండవ తెలుగు వ్యక్తి

రెండవ తెలుగు వ్యక్తి

ఇండియాకు చెందిన పలువురి మైనపు విగ్రహాలు టుస్సాడ్ మ్యూజియంలో నెలకొల్ప బడ్డాయి. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే ఆ అరుదైన అవకాశం దక్కించుకున్న తొలి తెలుగు వ్యక్తిగా అవతరించాడు. బాహుబలి తరువాత ప్రభాస్ క్రేజ్ జాతీయ వ్యాప్తం అయింది. ప్రభాస్ తరువాత ఆ అవకాశం దక్కించుకున్న రెండవ వ్యక్తిగా మహేష్ అవతరించాడు.

సూపర్ హ్యాపీ

ఈ విషయం గురించి తెలియజేస్తూ మహేష్ బాబు ట్వీట్ చేసాడు. మేడం టుస్సాడ్ మ్యూజియంలో తాను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉందని మహేష్ బాబు తెలిపాడు. మైనపు విగ్రహం నెలకొల్పడానికి వివరాలు సేకరించిన మేడం టుస్సాడ్ కళాకారులకు మహేష్ కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఆ వివరాలు త్వరలో

ఆ వివరాలు త్వరలో

కాగా మహేష్ మైనపు విగ్రహాన్ని టుస్సాడ్ మ్యూజియం ప్రతినిధులు ఢిల్లీలో నెలకొపుతారా లేక బ్యాంకాక్ లో ఉంచుతారా అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ వార్త గురించి తెలుసుకున్న మహేష్ ఫాన్స్ మాత్రం ఉబ్బి తబ్బిబవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X