twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ బాబు వెబ్ సిరీస్ టైటిల్ ఖరారు, వివరాలు ఇవే...

    |

    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం నటనకే పరిమితం కాకుండా సినిమా సంబంధిత వ్యాపారాలను మరింత విస్తరించుకుంటున్నారు. ఇప్పటికే సొంతగా నిర్మాణ సంస్థ 'మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్' స్థాపించిన ఆయన బ్రహ్మోత్సవం, శ్రీమంతుడు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

    ప్రస్తుతం ఆన్ లైన్ స్ట్రీమింగ్ మాధ్యమాల్లో వెబ్ సిరీస్‌లకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో సూపర్ స్టార్ ఆదిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. జియో ఎంటర్టెన్మెంట్స్ తో కలిసి వెబ్ సిరీస్ నిర్మాణంలో భాగస్వామ్యం కాబోతున్నారు.

    వెబ్ సిరీస్ టైటిల్ ఇదే..

    వెబ్ సిరీస్ టైటిల్ ఇదే..

    తాజాగా అందుతున్న సమాచారం ఈ వెబ్ సిరీస్‌కు ‘చార్లీ' అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది.సుకుమార్ మూవీ ‘నాన్నకు ప్రేమతో' చిత్రానికి రచయిత పని చేసిన హుస్సేన్ షా కిరణ్ దీనికి దర్శకత్వం వహించబోతున్నారు.

    ఏ తరహా వెబ్ సిరీస్

    ఏ తరహా వెబ్ సిరీస్

    డిటెక్టివ్ జోనర్లో ‘చార్లీ' వెబ్ సిరీస్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తం 24 ఎపిసోడ్లతో 3 సీజన్లుగా దీన్ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్ ఇండియాలో ఎక్కువ మందికి రీచ్ అయ్యేందుకు హిందీలో రూపొందిస్తున్నారట. తెలుగులో ఉంటుందా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు.

    మహేష్ బాబు

    మహేష్ బాబు

    మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వంశీపైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి' సినిమా చేస్తున్నారు. సూపర్ స్టార్ కెరీర్లో 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    నెక్ట్స్ మూవీస్..

    నెక్ట్స్ మూవీస్..

    మహేష్ బాబు తన తర్వాతి సినిమా సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ‘1-నేనొక్కడినే' సినిమా వచ్చింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. ఈ సారి ప్రయోగాలకు పోకుండా అభిమానులు, ప్రేక్షకులు మెచ్చే సబ్జెక్టుతో సుకుమార్ ఈ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Tollywood super star Mahesh Babu is producing a web series in collaboration with Jio Entertainments. The latest update on this project is that it is titled Charlie, directed by Hussain Sha Kiran.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X