గత కొన్నేళ్లుగా మహేష్ బాబు వాట్సప్ డీపీ అదే.. ఎంతైనా సూపర్ స్టార్ రేంజే వేరు!
గతవారం మహేష్ బాబు వాట్సప్ డీపీ అంటూ రకరకాల వార్తలు వచ్చాయి.మామూలుగా సెలెబ్రిటీల సీక్రెట్స్ తెలుసుకోవాలని అందరూ ఆసక్తిని కనబరుస్తుంటారు. వారి వాట్సస్ డీపీ, స్క్రీన్ లాక్, వాల్ పేపర్ ఏంటి ఇలాంటి విషయాలపై అభిమానులకు ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. అయితే గతవారం మహేష్ బాబు వాట్సప్ డీపీ గురించి వార్తలు వచ్చాయి. అసలు ఎంతో ప్రైవేట్‌గా ఉండే వాట్సప్ డీపీ ఎలా బయటకు వచ్చిందంటే..

వైల్డ్ డాగ్ ట్రైలర్..
నాగార్జున వైల్డ్ డాగ్ ట్రైలర్ బాగుందని ప్రశంసిస్తూ కింగ్ నాగ్‌కు మహేష్ బాబు స్పెషల్‌గా విషెస్ అందించాడు. ఈస్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయాలా? అని మహేష్ బాబు దగ్గర నాగ్ పర్మిషన్ తీసుకున్నాడు. దానికి మహేష్ బాబు కూడా అంగీకరించాడు.

అలా వాట్సప్ డీపీ లీక్..
అయితే మహేష్ బాబు పేరును నాగార్జున మహేష్ యాక్టర్ అని సేవ్ చేసుకున్నాడు. ఇందులో మహేష్ బాబు వాట్సప్ డీపీ క్లియర్‌గా కనిపించింది. ది లయన్ కింగ్ సినిమాలోని పోస్టర్ అని తెలుస్తోంది. లయన్ కింగ్‌లో ఫేమస్ క్యారెక్టర్ అయిన ముఫాసా, సింబాల గురించి అందరికీ తెలిసిందే. అలా కొండ మీద కూర్చున్న ముఫాసా ఫోటోను మహేష్ బాబు డీపీగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

మరోసారి హాట్ టాపిక్..
అయితే తాజాగా మరోసారి మహేష్ బాబు వాట్సప్ డీపీ హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు, మహర్షి సినిమా రెండూ కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. మహర్షి సినిమాకు జాతీయ అవార్డు రావడంపై టాలీవుడ్ అంతా సంతోషిస్తోంది. ఈ క్రమంలో మహర్షి సినిమా కంటే ముందుగా తనతో మహేష్ బాబు చేసిన చాటింగ్‌ను వంశీ పైడిపల్లి బయటపెట్టేశాడు.
Recommended Video

గత కొన్నేళ్లుగా..
ఊపిరి సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ రావడంతో.. మహేష్ బాబు కంగ్రాట్స్ తెలిపాడు. ఈ సారి మనం నేషనల్ అవార్డ్ కొట్టే సినిమా తీసేద్దాం అని మహేష్ బాబు అన్నాడు. దాని కోసం నేను ఏం చేసేందుకైనా సిద్దమే అని అన్నాడు. ఆ మెసెజ్‌ను తాజాగా వంశీ పైడిపల్లి బయట పెట్టేశాడు. ఈ చాటింగ్‌లోనూ మహేష్ బాబు డీపీ హైలెట్ అయింది. అందులోనూ అదే సింహం బొమ్మను మహేష్ బాబు డీపీగాపెట్టుకున్నాడు. అంటే దాదాపు గత నాలుగైదేళ్లుగా ఒకే డీపీని మెయింటైన్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











