ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో సందడి చేయబోతున్న మహేష్ బాబు
మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా రూపొందిన 'మహర్షి' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకోవడంతో రూ. 200 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసి సూపర్ స్టార్ సత్తా ఏమిటో మరోసారి ప్రూవ్ చేసింది. ఈ విజయానందంలో మహేష్ బాబు లాంగ్ ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేశారు. ఫ్యామిలీతో కలిసి యూరఫ్‌లో పర్యటిస్తున్నారు.
వివిధ దేశాలు పర్యటిస్తున్న మహేష్ బాబు ఇంగ్లండ్‌లో ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీలో భాగంగా జరుగుతున్న ఇండియా vs ఆస్ట్రేలియా మ్యాచ్‌లో సందడి చేయబోతున్నారట. ఇక్కడ మ్యాచ్ వీక్షించిన అనంతరం తిరిగి ఇండియా వస్తారని తెలుస్తోంది.

ఇండియా వచ్చిన వెంటనే మహేష్ బాబు తన నెక్ట్స్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' షూటింగులో జాయిన్ కాబోతున్నారు. మహేష్ కెరీర్లో 26వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఆర్మీ ఆఫీసర్‌గా, మిలటరీలో పని చేసే తన స్నేహితుడి కుటుంబానికి సహాయం చేసే పాత్రలో మహేష్ బాబు కనిపిస్తారని, అనిల్ రావిపూడి సినిమాల తరహాలో వినోదాత్మకంగా ఈ చిత్రం ఉండబోతోందని టాక్. లీకైనట్లుగా చెబుతున్న కథ ప్రకారం... ఈ చిత్రంలో మహేష్ బాబు ఫ్రెండ్ తల్లి పాత్రలో విజయశాంతి కనిపించబోతోందట. జగపతి బాబు విలన్ పాత్ర పోషిస్తున్నారని, నిర్మాత బండ్ల గణేష్ఒక ఫన్నీలో నటుడిగా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. రష్మిక మందన్న మహేష్ బాబుకు ప్రియురాలి పాత్రలో నటనకు ప్రాధాన్యం ఉన్న రోల్ చేస్తోందట.


Click it and Unblock the Notifications











