అదే మహేష్ భయమా?

By Staff

Mahesh Babu
ఓ ప్రక్క సినిమా లేటవుతోందని మహేష్ బాబు ఆలోచనలో పడుతూంటే...మరో ప్రక్క తండ్రి కృష్ణ కాంగ్రెస్ కి సపోర్టు చేయమంటూండటం అతన్ని ఇబ్బందిలో పడేస్తోంది. అయితే మహేష్ ని లబ్ది పొందుతున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే తప్పేంటి అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అందులోనూ ఎన్టీఆర్ మరో ప్రక్క తెలుగు దేశం ప్రచారానికి రెడీ అవుతున్న సమయంలో తనకేమి పట్టనట్లు ఎందుకుంటున్నాడని మరి కొందరు వాదిస్తున్నారు. అయితే ఇంట్లో వారికి,బయిట సలహాలు చెప్పే వారికి అతని మనస్సులో ఏముందో అర్ధం కావటం లేదని మహేష్ శ్రేయాభిలాషులు చెప్తున్నారు.

మహేష్ అభిమానులలో రకరకాల పార్టీలు,ఎజెండాలకు సంభందించిన వారున్నారని,ఇప్పుడు తాను ఓ ప్రత్యేక పార్టీకి మధ్దతు ఇస్తానంటే వారు తనను ఎప్పటిలాగే నిండు మనస్సుతో అభిమానిస్తారా అని మహేష్ భయపడుతున్నాడని సమాచారం. చక్కగా ఎదుగుతున్న కెరీర్ ను ఇలా ప్రక్కదారి పట్టించే రాజీకీయాలతో ముడి పెట్టడం ఇష్టం లేదని తెగేసి చెప్పుతున్నాడని అంతర్గత సమాచారం. అయితే కృష్ణ అభిమానుల్లో చాలా మంది మహేష్ అభిమానులుగా మారారు కదా..ఈ నేపధ్యంలో వారిని కన్ఫూజ్ చేయటం అవసరమా అనేది కుటుంబ పెద్దల అనుమానం. ఇక ఎవరెన్ని చెప్పినా మహేష్ మాత్రం తాను అభిమానులకు పిలుపు ఇవ్వనని తేల్చిచెప్పాసాడని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X