రియల్ ఎస్టేట్, సినిమా వ్యాపారంలోకి మహేష్ బాబు!

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే రీల్ లైఫ్‌లో 'బిజినెస్ మేన్'గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన రియల్ లైఫ్‌లోనూ బిజినెస్‌మేన్ అవతారం ఎత్తబోతున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన సొంతగా సినిమా నిర్మాణ సంస్థను స్థాపించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఓ వైపు సినిమాలు, మరో వైపు పలు కార్పొరేట్ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ సంవత్సరానికి రూ. 100 కోట్లపైనే మహేష్ బాబు సంపాదిస్తున్నాడని అంచనా. ఈ డబ్బును సినిమా నిర్మాణ రంగంలో పెట్టుబడిగా పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అదే విధంగా కొంత మొత్తాన్ని రియల్ ఎస్టేట్ రంగంలోనూ పెట్టబడి పెట్టనున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్ర విభజన తర్వాత వైజాగ్ తెలుగు సినిమా రంగంతో పాటు, ఆంధ్ర రాష్ట్రానికి కీలకమైన నగరంగా మారనున్న నేపథ్యంలో అక్కడ ఆస్తులు కొనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మహేష్ బాబుకు రెయిన్ బో హాస్పిటల్ కొంత వాటా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఓ వైపు సినిమాలు, మరో వైపు వ్యాపారంలో భారీగా ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడు మహేష్ బాబు.

సినీ నిర్మాణ రంగంలో అడుగు పెట్టడానికి ముందుగా కొంత అనుభవం కోసం 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి కొన్ని సినిమాల నిర్మాణంలో భాగస్వామి కావాలనే ఆలోచనలో ఉన్నాడట. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థతో మహేష్ బాబు ఇప్పటి వరకు 3 సినిమాలు కమిట్ అయ్యారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న 'ఆగడు' చిత్రం తర్వాత మరో సినిమా కూడా ఆ సంస్థతో కలిసి పని చేయనున్నాడు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ నిర్వాహకులైన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలతో మహేష్ బాబుకు మంచి స్నేహం ఉండటం కూడా ఆయన ఈ నిర్ణయానికి రావడానికి కారణమని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X