అందుకే మహేష్ బాబు ఓ సూపర్ స్టార్.. మేకప్ మ్యాన్‌కు బర్త్ డే విషెస్
మహేష్ బాబు ఊరికే సూపర్ స్టార్ అయిపోలేదు. కేవలం సినిమాల పరంగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటాడు. తాను చేసే మంచి పనులను బయటకు ప్రచారం చేసుకోవడం ఇష్టం లేని ఓ మహోన్నత వ్యక్తి. చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్నాడు. తన సొంత గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ది చేస్తున్నాడు. ఇలా మహేష్ బాబు వ్యక్తిగతంగా ఇష్టపడేవారే కోకొల్లలు. తాజాగా మహేష్ బాబు తన మేకప్ మ్యాన్ గురించి ఎంతో గొప్పగా చెబుతూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పుకొచ్చాడు.
ఒకప్పుడే మేకప్ మ్యాన్‌లకు ఉండే విలువ, ఆదరణే వేరు. నాటి ఎన్టీఆర్ కాలంలో మేకప్ మ్యాన్‌ను ఎంతో గౌరవించేవారని అందరూ చెప్పుకుంటారు. ఎన్టీఆర్ మేకప్ మ్యాన్ పీతంబరం గురించి సినీ ఇండస్ట్రీలో తెలియని వారెవ్వరూ ఉండరు. ఎన్టీఆర్ ఆయన్ను ఎంతగానో గౌరవించేవారట. అయితే ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. కానీ మహేష్ బాబు మాత్రం తన మేకప్ మేన్ గురించి చెప్పి అందరి మనసులను దోచుకున్నాడు.

నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు మేకప్ మ్యాన్ పట్టాబి బర్త్ డే. ఈ సందర్భంగా మహేష్ బాబు ఓ పోస్ట్ చేశాడు. 'హ్యాపీ బర్త్ డే పట్టాభి. పీక్స్‌లో షూటింగ్ సమయం నుంచి చివరగా ప్యాక్ అప్ చెప్పే సమయంలో చేసే టచ్ అప్ వరకు వెన్నంటి ఉండే వారు. ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నా'నని చెప్పుకొచ్చాడు. మహేష్ బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాట చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్దంగా ఉన్నాడు. కానీ కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా ఇప్పట్లో షూటింగ్ వద్దని నిర్మాతలకు సూచించినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











