కొరటాలను హత్తుకున్న మహేష్.. అట్రాక్టివ్ మెసేజ్ పెట్టాడు
టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివను ఆప్యాయంగా హత్తుకున్న ఫోటో షేర్ చేసి ఆయనపై ఉన్న అభిమానాన్ని తెలియజెప్పారు మహేష్ బాబు. ఈ రోజు (జూన్ 15) కొరటాల శివ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయనకు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే కొరటాలతో మహేష్ బాబుకు ఉన్న ప్రత్యేక అనుబంధం దృష్ట్యా అట్రాక్టివ్ మెసేజ్ పెడుతూ కొరటాలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియపడు మహేష్.
ఇప్పటివరకు కొరటాల శివ దర్శకత్వం వహించిన నాలుగు సినిమాల్లో రెండు చిత్రాలు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చినవే కావడంతో వీరిద్దరూ మంచి మిత్రులయ్యారు. అందుకే ఈ రోజు కొరటాల జన్మదినం సందర్భంగా ట్విట్టర్ ద్వారా తన ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలిపారు మహేష్. ''ప్రస్తుతం ఉన్న ఈ జెనరేషన్ లో మోస్ట్ టాలెంటెడ్ అండ్ విజనరీ డైరెక్టర్, నా ప్రియమైన స్నేహితుడు కొరటాల శివ గారికి జన్మదిన శుభాకాంక్షలు.. హ్యాపీ బర్త్ డే. ఈ ఏడాది మీకు బాగా కలిసి రావాలి" అని ట్వీట్ లో పేర్కొన్నారు.

ఇక ఈ ట్వీట్ తో పాటు కొరటాల శివను ఆత్మీయంగా హగ్ చేసుకున్న ఫోటో ఒకటి పోస్ట్ చేశారు మహేష్. ఈ పిక్ చూసిన మహేష్ అభిమానులు తెగ మురిసిపోతూ కొరటాలపై పుట్టిన రోజు శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. మహేష్ హీరోగా వచ్చిన 'భరత్ అనే నేను' సినిమా తర్వాత కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో తన కొత్త సినిమా చేయబోతున్నాడు. చిరు, కొరటాల శివ కాంబోలో రానున్న ఈ మెగా 152 ప్రాజెక్ట్ ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలు సంయుక్తంగా సమర్పించనున్నాయి. కమర్షియల్ అంశాలతో సామాజిక సందేశం మిక్స్ చేసి, సినిమాలను తెరకెక్కించడంలో స్పెషలిస్ట్ అయిన కొరటాల శివ.. ఈ ప్రాజెక్టుతో మరోసారి అలాంటి ప్రయత్నమే చేయనున్నారని తెలుస్తోంది. ఆగస్ట్‌లో లాంఛనంగా ప్రారంభించి వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట కొరటాల.


Click it and Unblock the Notifications











