హాట్ టాపిక్: రామ్ గోపాల్ వర్మ తో మహేష్ బాబు చిత్రం
నాకు ఇష్టమైన దర్శకుల్లో ఒకరు రామ్ గోపాల్ వర్మ. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే వదులుకోను అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు మహేష్ బాబు. ధంఫ్సప్ ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అయితే వర్మకు కూడా మహేష్ తో చేయాలని చాలాకాలంగా ఉందన్న సంగతి తెలిసిందే. అలాగే ఖలేజా చిత్రం గురించి చెబుతూ..త్రివిక్రమ్ గొప్ప టెక్నీషియన్ అనీ, అతని దర్శకత్వంలో మళ్ళీ సినిమా చేస్తాను..నా కెరీర్ లో బెస్ట్ ఫెర్ పార్మెన్స్ ఇచ్చిన సినిమా అదే..నా అభిమానులు ఎవరూ ఖలేజాతో భాదపడలేదు అన్నారు. ఇక దూకుడు చిత్రంలో తనలో ఓ కొత్త మహేష్ బాబుని చూస్తారని చెప్పుకొచ్చాడు. అలాగే కమర్షియల్ ఫార్మెట్ దాటితేనే వెరైటీ సినిమాలు వస్తాయని, అలాంటి వెరైటీ సినిమాలు చేసేందుకు తానెప్పుడూ రెడీనే అని అన్నాడు. ఇక వర్మ ప్రస్తుతం అప్పలరాజు చిత్రం బిజీలో ఉన్నాడు. ఈ చిత్రం అనంతరం అమ్మ అనే త్రీడీ హారర్ చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











