పిల్లలు,భార్యతో మహేష్ విహారం(మీరు చూడని ఫొటోలు)
హైదరాబాద్: మహేష్ బాబు తన వృత్తికి ఎంత ప్రయారిటీ ఇస్తాడో...తన కుటుంబానికి అంతకు మించి ప్రాధాన్యత ఇస్తారు. తప్పనిసరిగా వారితో శెలవులను స్పెండ్ చేస్తూంటారు. వేరే షెడ్యూల్స్ పెట్టుకోకుండా తన కుటుంబంతో గడపుతూ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్నాడు.
ముఖ్యంగా పిల్లలంటే మహేష్ కు విపరీతమైన ఇష్టం. ఎంత బిజి షెడ్యూల్ లో అయినా కుటుంబంతో, పిల్లలకు గడుపుతూ మిగతా హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏ ఇతర హీరో కూడా తన కుటంబంతో ఇంతలా గడపడేమో అనిపిస్తుంటుంది. ఈ క్రింద ఫొటోలు చూస్తే మీరు ఈ విషయం నిజమని ఒప్పుకుంటారు.
ముఖ్యంగా తన కూతురు సితారని భుజాలపై ఎక్కించుకుని, తన కొడుకు గౌతమ్ కృష్ణ ప్రక్కనే నడుస్తున్న ఈ ఫొటో చూస్తే...ఆయన తన పిల్లలతో ఎంత సరదాగా, జాలీగా గడుపుతున్నాడో మీకే అర్దం అవుతుంది.
ఇక మహేష్ తాజా చిత్రం విశేషాలకు వస్తే...
మహేష్ బాబు - ‘మిర్చి' ఫేం కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మరియు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర టీం యాక్షన్ ఎపిసోడ్ షూట్ లో బిజీగా ఉన్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఫ్యామిలో మహేష్ గడిపిన మధుర క్షణాలు ..స్లైడ్ షోలో..

కూతురుతో
మహేష్ కు కూతురు పుట్టిన రోజు నుంచి ఆ పాపతో ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ చేస్తూ కుటుంబంతో గడపటం ఎక్కువైందని అంటూంటారు.

కొడుకుతో అనుబంధం
తన కొడుకు గౌతమ్ తో మహేష్ కు చెప్పలేని అనుబంధం. రోజు ఉదయం సాయింత్రం ఎంత దూరాన ఉన్నా ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాడు.

హ్యాలీడేస్
తన షెడ్యుల్ గ్యాప్ లు కన్నా పిల్లలు కు ఎప్పుడు ఖాళీ ఉంటుందో చూసుకుని తను అప్పుడు గ్యాప్ తీసుకుంటూంటాడు

ఫారిన్ ట్రిప్స్
ఇక్కడ ఇండియాలో ఉంటే తన పిల్లలతో జాలీ ట్రిప్ లు వేయలేమని భావించే మహేష్...సరదాగా గ్యాప్ ఉన్నప్పుడు ఫారిన్ ట్రిప్ లు వేస్తూంటాడు.

భార్య సహకారం
మహేష్ ...తను షూటింగ్ లతో బిజిగా ఉంటే భార్య నమ్రత ఆ లోటు తెలియకుండా చూసుకుంటూంటుంది

రెండు వేరు వేరే
ఫ్యామిలీ లైఫ్, ప్రొఫిషినల్ లైఫ్ ...పొరపాటున కూడా మిక్స్ చేయటానికి మహేష్ ఇష్టపడరని చెప్తారు

పిల్లలుంటే సందడే
మహేష్ తో కాస్సేపు మాటలు పెడితే అందులో అతని పిల్లలు గురించి కబుర్లు ఎక్కువ ఉంటాయి

సాధారణ తండ్రిలా...
ఓ సూపర్ స్టార్ పిల్లల్లా వారిని పెంచకుండా ఓ సాధారణ తండ్రిలా వారిని లాలించి, దగ్గరకు తీసుకుని ప్రేమని పంచుతూంటాడు.

పీస్ ఫుల్
పిల్లలతో గడిపితే తన స్ట్రెస్ మొత్తం పోతుందని, వర్క్ చేసిన అలసట పోయి కొత్త ఎనర్జీ జనరేట్ అవుతుందని ఆయన సన్నిహితులతో అంటూంటారు.

బ్యానర్
తన కొడుకు పేరున గౌతమ్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ పెట్టి వ్రత్యేకంగా పిల్లలకు ఆదాయం జనరేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు మహేష్


Click it and Unblock the Notifications











