బెల్ ఫాస్ట్‌లో కొడుకు గౌతమ్‌తో మహేష్ బాబు (ఫోటో)
హైదరాబాద్ : మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ '1' (నేనొక్కడినే) సినిమాతో తెరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రను గౌతమ్ పోషిస్తున్నాడు. దీనికి సంబంధించిన సన్నివేశాలను లండన్ లో జూలై 7న చిత్రీకరించారు. ఆ తర్వాత షూటింగ్ ఐర్లాండ్ రాజధాని బెల్ ఫాస్ట్‌లో జరుగుతోంది. అక్కడ షూట్ జరుగుతున్నప్పుడు తీయించుకున్న ఫోటో ఇది.
గౌతమ్ ను నటింపజేసేందుకు మహేష్ ముందు ఒప్పుకోలేదని, దర్శకుడు సుకుమార్ పట్టుబడడంతో చివరకు అంగీకరించారని వెల్లడించారు. తన కుమారున్ని అప్పుడే సినిమాల్లోకి తీసుకురాకూడని మహేష్ భావిస్తున్నారని చెప్పారు. సినిమాలో ఫ్లాష్ బాక్ ఎపిసోడ్ లో గౌతమ్ పాత్ర వస్తుందని తెలిపారు.
'1' నేనొక్కడినే సినిమా యూరప్ లోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
డిఫరెంట్ చిత్రాలకు పెట్టింది పేరైన దర్శకుడు సుకుమార్....చాలా కాలం పాటు స్క్రిప్టు వర్కు చేసి...వైవిధ్యమైన అంశాలతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వినోదంతో పాటు అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రం ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రాక్ స్టార్‌గా కనిపించనున్నాడు.
ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : సుకుమార్.


Click it and Unblock the Notifications












