7.9 లక్షల మంది ఓటింగ్...మహేష్ బెస్ట్ అని తేల్చారు
టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఆన్ లైన్ పోల్‌లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. 'దూకుడు' చిత్రానికిగాను మహేష్‌కు ఈ సత్కారం లభించింది. ఆన్ లైన్ ఓటింగులో 7.9 లక్షల మంది పాల్గొనగా అందులో మహేష్ బాబే బెస్ట్ యాక్టర్ అని అత్యధిక శాతం తేల్చారు. అదే విధంగా మిల్కీ హాట్ బ్యూటీ తమన్నా '100%లవ్' చిత్రంలో నటనకుగాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు సొంతం చేసుకుంది.
ఇక బెస్ట్ మూవీ విషయానికొస్తే...కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'దూకుడు'నెం.1 స్థానంలో నలిచింది. ఈచిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీను వైట్లను ఆన్ లైన్ ఓటర్లు బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో అందలం ఎక్కించి నెం.1 అని తీర్చు ఇచ్చారు.
ఈ ఓటింగులో అవార్డుల పూర్తి డీటేల్స్
ఉత్తమ నటుడు : మహేష్ బాబు(దూకుడు)
ఉత్తమ నటి : తమన్నా(100%లవ్)
ఉత్తమ చిత్రం : దూకుడు
ఉత్తమ దర్శకుడు : శ్రీను వైట్ల(దూకుడు)
ఉత్తమ సంగీత దర్శకుడు : తమన్(దూకుడు)
ఉత్తమ గీత రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి(మిస్టర్ పర్ ఫెక్ట్)
ఉత్తమ గాయకుడు : ఎస్ పి బాలు (శ్రీరామ రాజ్యం)
ఉత్తమ గాయని : శ్రేయ ఘోషల్(మిస్టర్ పర్ ఫెక్ట్)
ఉత్తమ యూత్ ఫిల్మ్: 100%లవ్
ఉత్తమ న్యూకమర్ : ఆది (ప్రేమ కావాలి)
ఉత్తమ న్యూకమర్(ఫిమేల్: నిత్యా మీనన్(అలా మొదలైంది)
నెగెటివ్ రోల్ లో ఉత్తమ నటన : కోట శ్రీనివాసరావు (దూకుడు)
నెగెటివ్ రోల్ లో ఉత్తమ నటన(ఫిమేల్) : మంచు లక్ష్మి(అనగనగా ఓ ధీరుడు)
ఉత్తమ స్ర్కీన్ ప్లే : నందిని రెడ్డి(అలా మొదలైంది)
ఉత్తమ హాస్య నటుడు : బ్రహ్మానందం (దూకుడు)


Click it and Unblock the Notifications











