మహేష్ బాబు, జూ ఎన్టీఆర్ మధ్య పోరు తప్పదా?
ఈ ఆగస్టు 15న మహేష్ బాబు,జూ.ఎన్టీఆర్ చిత్రాలు రెండూ ఒక దానికొకటి పోటీ పడనున్నాయి. ఎన్టీఆర్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందున్న బృందావనం, మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న కలేజా చిత్రం రెండూ ఒకే సారి రిలీజ్ కానున్నాయిని అంతర్గత సమాచారం. అయితే కొందరు పరిస్రమలో పెద్దలు రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ చేయటం ఇండస్ట్రీకే దెబ్బ అని ఒక చిత్రాన్ని వాయిదా వేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎవరి చిత్రం ఆగుతుంది,ఎవరు వెనక్కి వెళ్ళతారనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇక దిల్ రాజు తను మొదటే రిలీజ్ డేట్ ఇచ్చుకున్నట్లుగా విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు చెప్తున్నారు. అయితే మహేష్ చిత్రం వచ్చి రెండున్నర ఏళ్ళు పైనే అయింది కాబట్టి దాన్ని విడుదల చేయటమే పద్దతి ఆ నిర్మాత చెప్తున్నట్లు సమాచారం. ఇక మహేష్ చిత్రంలో అనూష్క హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఎన్టీఆర్ చిత్రంలో సమంత, కాజల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











