మహేష్ భట్ లీలల వీడియో లీక్.. రియా చక్రవర్తే కాదు.. మరో 16 ఏళ్ల హీరోయిన్‌తో సరసాలు!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా కొనసాగుతుంటూ మహేష్ భట్‌కు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సుశాంత్ మరణం వెనుక రియాతో కలిసి మహేష్ భట్ కుట్రలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ అగ్ర దర్శకుడి బండారాన్ని నెటిజన్లు బయటపెడుతున్నారు. ప్రస్తుతం ఓ కుర్ర హీరోయిన్‌తో కలిసి మహేష్ భట్ సన్నిహితంగా ఉన్న వీడియో గురించి మరిన్ని వివరాలు..

Recommended Video

Sushant Singh Rajput : రియా చక్రవర్తే కాదు.. మరో 16 ఏళ్ల హీరోయిన్‌తో మహేష్ భట్‌ సరసాలు! || Oneindia
సుశాంత్ మరణం తర్వాత మహేష్ భట్‌పై

సుశాంత్ మరణం తర్వాత మహేష్ భట్‌పై

సుశాంత్ మరణం తర్వాత ఎక్కువ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖుల్లో మహేష్ భట్ ఒకరు. రియాతో కలిసి కుట్ర పన్నారనే ఆరోపణలు బాలీవుడ్‌లో సంచలనం రేపాయి. మహేష్ భట్‌తో కూడిన కొందరు బాలీవుడ్‌లో సూసైడ్ గ్యాంగ్ అంటూ కంగన రనౌత్ ఆరోపించడం మరింత సెన్సేషన్‌గా మారింది. రియాతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే సుశాంత్ మరణంలో అనేక అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి.

మహేష్ భట్‌ను ప్రశ్నించిన ముంబై పోలీసులు

మహేష్ భట్‌ను ప్రశ్నించిన ముంబై పోలీసులు

మహేష్ భట్ తీరుపై కంగన రనౌత్ చేసిన ఆరోపణలు బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపాయి. కంగన ఆరోపణల తర్వాత మహేష్ భట్‌ను ముంబై పోలీసులు హడావిడిగా విచారించారు. అయితే మహేష్‌ను ముంబై పోలీసులు ప్రశ్నించడం కంటితుడుపు చర్యే అనే మరో అరోపణ మీడియాలో హల్‌చల్ చేసింది.

రియా, మహేష్ భట్ వాట్సాప్ ఛాటింగ్

రియా, మహేష్ భట్ వాట్సాప్ ఛాటింగ్

మహేష్‌ భట్‌పై ఇలాంటి ఆరోపణలు ఓ వైపు వెల్లువెత్తుతున్న తరుణంలోనే మరో పక్క రియాతో చేసిన సీక్రెట్ ఛాటింగ్ మీడియాలో బయటకు వచ్చింది. దాంతో సుశాంత్ కేసులో మహేష్ భట్, రియా పాత్రలపై మరింత అనుమానాలు రేకెత్తాయి. ఈ వ్యవహారంపై సీబీఐ కూడా విచారించే అవకాశాలు లేకపోలేవనే మాట వినిపిస్తున్నది.

16 ఏళ్ల జియా ఖాన్‌తో సరసాలు

16 ఏళ్ల జియా ఖాన్‌తో సరసాలు

సుశాంత్ కేసులో అనేక అనుమానాలు రేకేత్తడం, సీబీఐ దర్యాప్తు చేస్తున్న సమయంలోనే తాజాగా బాలీవుడ్ హీరోయిన్, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన జియాఖాన్‌తో మహేష్ భట్ అతి సన్నిహితంగా ఉన్న వీడియో ప్రస్తుతం మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ వీడియోలో కనిపించే జియాకు అప్పుడు 16 ఏళ్లు మాత్రమే. ఇలా ఈ వీడియోలో జియాఖాన్‌ను ఒడిలో పెట్టుకొని అతి సన్నిహితంగా వ్యవహరించడం కనిపించింది.

అనుమానాస్పదంగా జియా ఖాన్ మరణం

అనుమానాస్పదంగా జియా ఖాన్ మరణం

జియా ఖాన్ విషయానికి వస్తే.. రాంగోపాల్ వర్మ రూపొందించిన నిశ్శబ్ద్ చిత్రంతో హిందీ పరిశ్రమలోకి ప్రవేశించారు. 2007లో వచ్చిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి జియా ఖాన్ నటించారు. ఆ తర్వాత 2013 జూన్ 3 తేదీన జియా ఖాన్ అనుమానాస్పద పరిస్థితుల్లో ముంబైలోని ఓ ఫ్లాట్‌లో మరణించారు. ఈ కేసులో సూరజ్ పంచోలిపై కేసు నమోదైంది. సూరజ్ తండ్రి ఆదిత్య పంచోలి తన పలుకుబడితో కేసును నీరుగార్చారని జియా ఖాన్ తల్లి ఇప్పటికీ ఆరోపణలు చేస్తుండటం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X