మహేష్ బ్రాండ్ విలువ 60 కోట్లు
బిజినెస్ మ్యాన్ సూపర్ హిట్ కావటంతో మహేష్ బ్రాండ్ విలువ అమాంతం రెట్టింపు అయ్యింది. గత సంవత్సరం 30 నుంచి 40 కోట్ల మధ్య ఉన్న బ్రాండింగ్ వాల్యూ ఈ సంవత్సరం అది మరో 30 కోట్ల రూపాయలకు పైగా పెరగనుందని వ్యాపార వర్గాలు అంచనా. అంటే మహేష్ బ్రాండిగ్ వ్యాల్యూ అరవై కోట్లుకు చేరిందన్నమాట. దాంతో ఇప్పటికే పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న మహేష్ బాబు త్వరలో మరిన్ని వాణజ్య ప్రకటనల్లో కనిపించనున్నారు. బ్రాండ్ల విషయంలో ఆయన బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ సరసకు చేరారు. జాతీయ స్థాయిలో ఒక్కో విభాగంలో టాప్‌లో ఉన్న కంపెనీలన్నీ రీజనల్ స్థాయికి వచ్చే సరికి ఎపి మార్కెట్ కోసం మహేష్ వద్దకే వస్తున్నాయి.దూకుడు చిత్రంతో రికార్డులను తిరగరాసిన మహేష్ బాబు మూడు నెలలు తిరక్కుండానే మరో హిట్ చిత్రాన్ని అందించడం ఆయనతో కలసి ప్రయాణిస్తున్న,చేద్దామనుకున్న పలు కంపెనీలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
దాంతో పలు కంపెనీలు ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. తాజాగా సంతూర్ ప్రచార బాధ్యతలను పంచుకునేందుకు అంగీకరించిన మహేష్ ఈ సంవత్సరం మరో నాలుగు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చని అంచనా. ఇక మరో మూడు కంపెనీలు ఇప్పటికే ఆయన్ను తమ బ్రాండ్ల కోసం సంప్రదించాయని తెలుస్తోంది. వీటిల్లో ప్రముఖ ఫుడ్ ప్రొడక్ట్ సంస్థ, మరో హెల్త్ డ్రింక్ బ్రాండ్ ఉన్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే అమృతాంజన్, నవరత్న ఆయిల్, యూనివర్సెల్, థమ్స్ అప్, ఐడియా సెల్యులార్, జాస్ అలుక్కాస్, ప్రొవోగ్, గిల్లెట్, వివెల్ షాంపూలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల తొలి వారంలో దేశంలో అతిపెద్ద సోప్ బ్రాండ్‌గా ఉన్న సంతూర్ ప్రమోషన్ కోసం విప్రో సంస్థ మహేష్‌ను ఆశ్రయించింది. ఈ కంపెనీ వ్యాపార ప్రకటనను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











