‘టి’రికార్డ్-2000 థియేటర్లలో ‘బిజినెస్ మేన్’!
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా సినిమా 'బిజినెస్ మేన్' రికార్డు స్థాయిలో ఏకంగా 2000 థియేటర్లలో విడుదలకు సిద్దం అవుతోంది. ఓవర్సీస్ లోనూ మహేష్ బాబు సినిమా ఈ సారి రికార్డులు నమోదు చేస్తోంది. అమెరికాలో ఏకంగా వందకు పైగా(114) థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇక అత్యధికంగా షేర్ వచ్చే నైజాం ఏరియాలో బిజినెస్ మేన్ సినిమా 250 థియేటర్లలో ప్రదర్శితం కాబోతోంది. వీటిలో కేవలం హైదరాబాద్ లోనే 90 థియేటర్లు బుక్కయ్యాయి. మహేష్ బాబు కెరీర్లో కూడా ఇదే భారీ రిలీజ్ రికార్డు.
ఐదేళ్ల క్రితం మహేష్-పూరి కాంబినేషన్లో వచ్చిన 'పోకిరి' సినిమా టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టింది. పెట్టుబడికి నాలుగురెట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు బిజినెస్ మేన్ భారీ రిలీజ్ ను చూస్తుంటే మరోసారి మహేష్-పూరి కాంబినేషన్ చరిత్ర సృష్టించడం ఖాయం అనే వాదన వినిపిస్తోంది. అభిమానులు కూడా ఈ విషయమై చాలా నమ్మకంగా ఉన్నారు. మహేష్ బాబు మరోసారి సంక్రాంతి హీరో కావడం ఖాయం అంటున్నారు.
జనవరి 13న 'బిజినెస్ మేన్' సినిమా విడుదలవుతోంది. మహేష్ సరసన తొలిసారిగా కాజల్ నటిస్తోంది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ సంస్థ పూరి జగన్నాథ్ దర్వకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ముంబై మాఫియా, ఆయుధాల వ్యాపారం నేపథ్యంలో ఈ సినిమా స్టోరీలైన్ ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











