భాయ్ కాబోయి.. ('బిజినెస్ మ్యాన్' ప్రివ్యూ)

By Srikanya

మహేష్ బాబు, పూరీ జగన్నాధ్ ల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం బిజినెస్ మ్యాన్. సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్న ఈ చిత్రంలో మహేష్...సూర్య అనే డిఫెరెంట్ క్యారక్టరైజేషన్ తో కనిపిస్తాడు. ఏదో బతికేస్తున్నాంలే... అనుకొనే రకం కాదు సూర్య (మహేష్‌బాబు). ఎలా బతకాలి.. అనే విషయంపై అతనికంటూ కొన్ని ఆలోచనలున్నాయి. చేతిలో తుపాకీ, చుట్టూ పదిమంది జనం, తన ఎదురుగా తలవంచే డాన్‌లూ.. ఇదీ అతను కలలుగనే జీవితం.

భాయ్‌ అవ్వాలనేది అతని ఆశయం. అందుకే ముంబై వస్తాడు. “యే మేరా స్టైల్ హై..యే మేరా దందా హై" అంటూ ముంబై మాఫియా బిజినెస్ మ్యాన్ గా లైఫ్ ని ప్రారంభిస్తాడు. ఇక అతనికి చిత్ర (కాజల్‌)పరిచియమువుతుంది. ఆమెది వేరే ప్రపంచం. తనో చిత్రకారిణి. రంగులు, బొమ్మలతోనే కాలక్షేపం చేస్తుంది. వీరిద్దరికీ పరిచయం ఎక్కడ ఎలా జరిగింది? ముంబైలో సూర్యకి ఎదురైన పరిస్థితులేంటి? భాయ్‌గా నిలబడేందుకు ఎంతమందిని ఎదిరించాడు? అనే విషయాలు ఆసక్తికరం. ఇక ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''మహేష్‌ కోసమే రాసుకొన్న కథ ఇది. ఆ పాత్ర ప్రవర్తించే విధానం చాలా తమాషాగా ఉంటుంది. యాక్షన్‌ సన్నివేశాలు, సంభాషణలు కూడా అందరికీ నచ్చుతాయి. తమన్‌ బాణీలకు మంచి స్పందన వస్తోంది. 'సారొత్తారు..' ప్రధాన ఆకర్షణ'' అన్నారు.

బిజినెస్‌మేన్‌
సంస్థ: ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌
నటీనటులు: మహేష్‌ బాబు, కాజల్‌, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మాజీ, సాయాజీ షిండే, ధర్మవరపు, భరత్‌రెడ్డి తదితరులు
సంగీతం: తమన్‌;
నిర్మాత: వెంకట్‌
రచన-దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
విడుదల: శుక్రవారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X