బిజినెస్ మ్యాన్.... ఫుల్ స్టోరీ
సూర్య(మహేష్ బాబు) తల్లిదండ్రులు అమెరికాలో సెటిల్ అవుతారు. అక్కడ సంపాదించిన డబ్బుతో ఇండియాలో ఏదైనా వ్యాపారం చేద్దామని వస్తారు. అప్పటికి మహేష్ ది చిన్న వయసు. జయదేవ్(ప్రకాష్ రాజ్) వీరిని మోసం చేసి డబ్బు గుంజుకుని సూర్య తల్లిదండ్రులను చంపేస్తాడు. సూర్య ఈ చిన్న వయసులో తల్లిదండ్రులను చంపిన వారిపై హత్యాయత్నం చేయబోయి బోస్టన్ స్కూల్ లో చేరుతాడు. ఈ క్రమంలో ఇక్కడి మనుషుల మీద, ఈ దేశం మీద కసి పెంచుకుంటాడు. అప్పటికి ముంబైలో డాన్ ఎవరూ ఉండరు. తనే డాన్ గా ఎదగాలనుకుంటాడు. తన స్నేహితుడు బ్రహ్మాజీతో కలిసి లోకల్ గా చిన్న గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుంటాడు. మంచి చెడు తేడా లేకుండా సెటిల్ మెంట్లు చేస్తూ భాయ్ గా ఎదుగుతుంటాడు. ఈక్రమంలోనే ప్రతిపక్ష పార్టీ లాలూ(షయాజీ షిండే)కి పొలిటికల్ సపోర్టు ఇచ్చి మేయర్ గా గెలిపిస్తాడు. రూలింగ్ పార్టీలో ఉన్న జయదేవ్(ప్రకష్ రాజ్)కి కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు. పోలీస్ కమీషనర్ కూతురు చిత్ర(కాజల్)ను ట్రాప్ చేసి ప్రేమిస్తున్నట్లు నటిస్తాడు. తనకు ఉపయోగ పడుతుందనే ఉద్దేశ్యంతోనే మొదలు పెట్టి నిజంగానే ప్రేమిస్తాడు. దేశం మొత్తం సూర్య భాయ్ నెట్కవర్క్ విస్తరిస్తుంది. ప్రధాన మంత్రిని శాసించే స్థాయికి ఎదుగుతాడు. మరి సినిమా క్లైమాక్స్ ఏమిటి అనేది తెరపై చూడాల్సిందే.
సినిమాలో సీన్ టు సీన్ మహేష్ బాబే కనిపిస్తాడు. డైలాగ్స్ అదిరి పోయాయి. సినిమా విజయ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. కాజల్ పెర్ఫార్మెన్స్ ఫర్వాలేదు. ప్రకాష్ రాజ్, షయాజీ షిండే, నాజర్ తదితరులు తమ తమ పాత్రల మేరకు బాగా నటించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. థమన్ సంగీతం సమకూర్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు బిజినెస్ మ్యాన్ సినిమా తెలుగు సినిమా చిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 2 వేల థియేటర్లలో రిలీజైంది.


Click it and Unblock the Notifications











