'బిజినెస్ మ్యాన్' టాక్ ఏంటి?
మహేష్ తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రెండువేల థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ చిత్రం ఇనీషియల్ గా అందిన టాక్ ప్రకారం...హిట్ అని తెలుస్తోంది. అయితే దూకుడు రేంజా,పోకిరీ రేంజా అనేది తేలాలి అంటున్నారు. పస్టాఫ్ ఫన్ తో గడిచిపోయినా,సెకండాఫ్ మొత్తం గన్స్ ,పోలీసులు,ప్రేమతో నడుస్తుంది. దాంతో కొద్దిగా స్లో అయ్యినా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకు హైలెట్ అని చెప్తున్నారు. ఇక ఈ చిత్రం కథ ముంబై కి డాన్ అవుదామనే సూర్య అనే కుర్రాడి కథ. అతనికో సాడ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. పక్కా రివేంజ్ తో నడిచే స్టైలిష్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు.అలాగే ఈ కథ గొప్పగా లేక పోయినా హీరో క్యారెక్టైరేజన్ హైలెట్ గా తీర్చిదిద్దటం ప్లస్ అయ్యిందని,అదే టాక్ పాజిటివ్ గా రావటానికి కారణమంటున్నారు.
ఇక కాజల్ కూడా ఇంతకుముందు లేని విధంగా ఈ సినిమాలో గ్లామర్ తో కుర్రకారుకి వెర్రిక్కించిందని అంటున్నారు. ఇక మహేష్ చెప్పే పంచ్ డైలాగ్స్ కు ధియోటర్స్ లో విజిల్స్ మ్రోగుతున్నాయి. అయితే పూరీ టేకింగ్ కొత్తగా ఏమి లేదని,మహేష్ గ్లామర్ సినిమాని నిలబెడుతుందని,సంక్రాతి విజేతగా చిత్రం నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఇక నిర్మాతలు ఆర్ ఆర్ మూవీ మేకర్స్ వారు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో, విజయవాడలో కొన్ని ఏరియాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా స్వయంగా విడుదల చేసారు. మునుపెన్నడూ లేని విధంగా ఉత్తరాంధ్రలో 70 థియేటర్లలో 'బిజినెస్‌మేన్' ని విడుదల చేస్తోంది. నైజాంలో 110 థియేటర్లు, హైదరాబాద్‌లో 100 థియేటర్లు బుక్ చేసి భారీగా విడుదల చేసారు. చాలా చోట్ల ఉదయాన్నే బెనిఫిట్ షోలు పడిపోయాయి.


Click it and Unblock the Notifications











