శబ్దాలయ స్టూడియోలో మహేష్ బిజినెస్ జోరుగా హుషారుగా సాగుతోంది...!
దూకుడు సినిమా ఇచ్చిన సూపర్ సక్సెస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిజినెస్ మ్యాన్ చిత్రం షూటింగ్ లో మంచి జోష్ తో పాల్గొంటున్నాడు. ప్రిన్స్ మహేష్ బాబు 'బిజినెస్ మాన్" చిత్రం ప్రస్తుతం శబ్దాలయ స్టూడియోస్ లో డబ్బింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులతో డబ్బింగ్ జరుగుతుంది.
ఇటీవలే మహేష్ బాబు మరియు మరికొంత మంది యూనిట్ సభ్యులు పాటల చిత్రీకరణ కోసం బ్యాంకాక్ వెళ్లారు. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన కాజల్ నటిస్తోంది. బిజినెస్ మాన్ చిత్రాన్ని ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ నిర్మిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 11 జనవరి 2012న విడుదల చేయబోతున్నారు. ముంబై నేపధ్యంగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న బిజినెస్ మాన్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, షాయాజి షిండే, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, భరత్‌రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్‌రాజ్, ఆయేషా తదితరులు నటిస్తున్నారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై డావెంకట్ నిర్మిస్తున్నారు. సంగీతం: థమన్, కెమెరా: శ్యామ్ కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, డాన్స్: దినేష్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, లైన్ ప్రొడ్యూసర్: నీరజ్ శర్మ, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, కథ-కథనం-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











