మహేష్ ‘బిజినెస్ మ్యాన్’ లేటెస్ట్ అప్డేట్స్
పోకిరి తర్వాత మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'బిజినెస్ మ్యాన్'. ఆర్.ఆర్ మూవీమేకర్స్ పతాకంపై నిర్మాత వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ 'షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో భాగంగా రీ రికార్డింగ్ జరుగుతోందన్నారు.
ఈనెల 22న తెలుగు, తమిళ, మలయాళంలో ఆడియో విడుదల చేస్తున్నాం. థమన్ అద్భుతమైన సంగీతం అందించాడు. జనవరి 11న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నాం. 'పోకిరి' తర్వాత మా ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా చిత్రాన్ని తెరకెక్కించాం. ఇందులో సూర్యగా మహేష్ అద్భుతంగా నటించాడు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ప్రచార చిత్రాలకు విశేష స్పందన లభిస్తోందన్నారు.
ప్రకాష్‌రాజ్, షాయాజీ షిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, బండ్ల గణేష్, భరత్ రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్‌రాజ్, ఆయేషా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయా గ్రహణం: శ్యామ్.కె. నాయుడు, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్, ఎస్.ఆర్.శేఖర్.


Click it and Unblock the Notifications











