కేక పెట్టిస్తున్న మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ ఫస్ట్ లుక్...!
మహేష్ బాబు-కాజల్ అగర్వాల్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న బిజినెస్ మెన్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దూకుడు లో లాగే బిజినెస్ మెన్ లో కూడా పంచ్ డైలాగ్ లు ఉంటాయన్న విషయం ట్రైలర్ లో మరో సారి కనిపిస్తుంది. దూకుడు డైలాగ్ లు ఎంత ఫేమస్ అయ్యాయో తెలిసిందే. ఆ మధ్యన ఇవే మహేష్ బిజిజెస్ మ్యాన్ డైలాగ్స్ అంటూ హల్ చల్ చేశాయి. అయితే మరొకటి పవర్ ఫుల్ డైలాగ్ తో బిజినెస్ మ్యాన్ ఫస్ట్ లుక్ అధికారికంగా భయటికొచ్చింది.
బిజినెస్ మ్యాన్ లో పంచ్ డైలాగులు చాలానే ఉన్నా తాజాగా లీకైన డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంది. 'నా గన్ కి లైసెన్స్ ఉంది..నీ ప్రాణానికే ఇన్సూరెన్స్ లేదు అనేదే ఆ డైలాగ్. ఈ పవర్ ఫుల్ డైలాగ్ ని మహేష్ కూల్ గా, తనదైన స్టైల్లో చెప్పి అదరగొట్టి ఉంటాడని ఊహించవచ్చు. మహేష్, పూరిల పోకిరి డైలాగ్స్ రేంజ్ లోనే బిజినెస్ మెన్ డైలాగ్స్ ఉంటాయని తెలుస్తుంది. బిజినెస్ మెన్ లో యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఎక్కువ ఉండన్నున్నాయట. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఆర్ ఆర్ వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన మొదటి సారిగా కాజల్ జతకడుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని జనవరి 11న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











