twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దూకుడు ఇచ్చిన షాక్ తో నాలుగు బాషల్లో బిజినెస్ చేస్తున్న మహేష్...!

    By Sindhu
    |

    పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నిర్మించబోయే చిత్రం "ది బిజినెస్ మ్యాన్". ఈ చిత్రానికి క్యాప్షన్ గా "గన్స్ డోంట్ నీడ్ ఎగ్రిమెంట్స్" ( తుపాకులకు ఒప్పందాలతో పని లేదు ) అని నిర్నయించారు. గతంలో పూరీ జగన్నాథ్, మహేష్ బాబుల కాంబినేషన్ లో వచ్చిన "పోకిరి" చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బ్రద్దలు కొట్టింది. అందుకనే మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి.

    మహేష్ బాబు దూకుడు రిలీజ్ తరువాత సంచలనాలు, రికార్డులు సృష్టిస్తుంటే, బిజినెస్ మెన్ మాత్రం రిలీజ్ కు ముందే సంచలనాలు నమోదు చేస్తుంది. ఇప్పటికే మహేష్ కెరీర్ లోనే అత్యంత ఫాస్ట్ గా తెరకెక్కుతున్న చిత్రంగా ఉన్న బిజినెస్ మెన్ , బిజినెస్ విషయంలోనూ రికార్డులు క్రియేట్ చేస్తుంది. బిజినెస్ మెన్ షూటింగ్ దశలో ఉండగానే సినిమాకు సంబంధించిన బిజినెస్ పూర్తయ్యింది. ఓవర్ సీస్ రైట్స్ అమ్మకాలు కూడా పూర్తయ్యాయి.

    పోకిరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఫ్యాన్స్ కూడా చాలా ఆశలతో ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగు సినీ పరిశ్రమ ఇంతవరకు వెళ్ళని రూట్లలో కూడా బిజినెస్ మెన్ బిజినెస్ చేస్తుంది. ఇప్పుడు వరకు ఏ తెలుగు సినిమా విడుదల అవ్వని విధంగా నాలుగు బాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం తో పాటు హిందీ లోనూ సినిమా రిలీజ్ చేయబోతున్నారట. బిజినెస్ మెన్ సినిమాను తెలుగులో మహేష్ తోనూ, హిందీలో అభిషేక్ బచ్చన్ తోనూ చేయబోతున్నారని టాక్ వచ్చింది. అయితే ప్రస్తుతం తెలుగులో మహేష్ చేస్తున్న బిజినెస్ మెన్ నే హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

    సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.

    English summary
    Mahesh Babu and Puri Jagannath's second film - Businessman is turning out to be mammoth project. The film has been making news for its breakneck speed of shoot and now Puri announces that they are planning to release the movie in Tamil and Malayalam languages too on the same day of its Telugu release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X