మహేష్ ‘బిజినెస్’ దూకుడు రేంజ్ లో ఉండాలి లేదా క్రాస్ చేయాలి..: పూరి
మహేష్ బిజినెస్ మెన్ సంచలనాలకు సిద్దమవుతుంది. సంచలనాలు సృష్టించడానికి కూడా మంచి ముహూర్తం కావాలని అనుకున్నారేమో కాని బిజినెస్ మెన్ దర్శక నిర్మాతలు ఫస్ట్ లుక్ కోసం కూడా మంచి ముహూర్తం ఖరారు చేసుకొని విడుదల చేశారు. ఇప్పటివరకు మహేష్ కెరీర్ లోనే ఏ సినిమా చేయనంత ఫాస్ట్ గా బిజినెస్ మెన్ షూటింగ్ జరుగుతుంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ చేసిన దూకుడు వంద రోజులకు మునుపే బిజినెస్ మెన్ బయటకు రానుంది.
ఇలా రౌండప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చెయ్యొద్దు. ఎందుకంటే కన్ఫ్యూజన్‌లో ఎక్కువ కొట్టేస్తాను"" -'బిజినెస్‌మేన్" టీజర్‌లోని డైలాగ్ ఇది. పూరి శైలిలో..మహేష్ ట్రీట్‌మెంట్ ను.. అభిమానులు, ప్రేక్షకులలోకి పాదరసంలా పంప్ చేస్తున్న డైలాగ్ ఇది. 11.11.11న ఈ సినిమా ఫస్ట్ లుక్ స్టిల్ రిలీజైన విషయం విధితమే. ముంబై నేపథ్యంలో సినిమా కథ సాగుతుంది. ఇప్పటికే బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజు ఏర్పడింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. డిసెంబర్ 8కి చిత్రీకరణ పూర్తిచేసి, అదే నెల 2వ వారంలో ఆడియో రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్.ఆర్.ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ దూకుడు అర్థశతదినోత్స కార్యక్రమ క్లిప్పింగ్స్ లోమాట్లాడుతూ ''హీరోయిజాన్ని ఆకాశం అంత ఎత్తులో చూపించే సినిమా ఇది. మహేష్ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తన నటనావైవిధ్యం బిజినెస్..ను ఓ రేంజ్‌కు తీసుకెళ్తుంది. 'పోకిరి" తర్వాత..ఈసారీ బాక్స్‌లు బద్దలు కొట్టడానికి వస్తున్నాం"" అన్నారు. అలా ఈ చిత్రం దూకుడుని క్రాసైనా చేయాలి. లేదా దూకుడు రేంజ్ లో అన్నా ఆడాలి అన్నారు. ఆర్.ఆర్.మూవీమేకర్స్ పతాకంపై డావెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజల్ కథానాయిక. సంగీతం: థమన్, కెమెరా: శ్యామ్ కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, డాన్స్: దినేష్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, లైన్ ప్రొడ్యూసర్: నీరజ్ శర్మ, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, కథ- కథనం-మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











