లక్ష్మణుడులాంటి తమ్ముడు పాత్రలో మహేష్
హైదరాబాద్: వెంకటేష్- మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ .. లక్ష్మణుడులాంటి తమ్ముడు పాత్రలో కనిపిస్తున్నట్లు దిల్ రాజు చెప్తున్నారు. హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు.
దిల్ రాజు మాటల్లో...''రామాయణం అంటే సీతమ్మ కష్టాలు... రామరావణ యుద్ధమే కాదు. అదో అనుబంధాల చరితం. సీత కోసం రాముడు, రాముడి కోసం లక్ష్మణుడు.. అందరి కోసం హనుమంతుడు! ఇక్కడ కూడా రాముడులాంటి అన్నయ్య.. లక్ష్మణుడులాంటి తమ్ముడు ఉన్నారు. అనుబంధాలకు నెలవైన కుటుంబం అది. ఆ ఇంట్లో జరిగే హృద్యమైన కథే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. విరగబూసిన మల్లె చెట్టంత అందంగా సినిమా ఉంటుంది. తెలుగింటి సంస్కృతి సంప్రదాయాలు, అనుబంధాలు అడుగడుగునా కనిపిస్తాయి. అయిదు పాటలున్నాయి. అన్నీ కథలో భాగంగానే వస్తాయి'' అన్నారు.
ఇక ఈ చిత్రం ఆడియో పంక్షన్ ని తిరుపతి లో నిర్వహించాలని ప్లాన్ చేస్తనున్నట్లు సమాచారం. వేలాది మంది వెంకటేష్ ప్యాన్స్,మహేష్ ప్యాన్స్ సమక్షంలో గ్రాండ్ గా ఈ చిత్రం ఆడియో చేయాలని దిల్ రాజు తన హీరోలతో చెప్పినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 21 న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దిల్ రాజు నిర్ణయించారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్లు మహేష్ బాబు బర్త్ డేను పురస్కరించుకుని గత నెల విడుదలయ్యాయి. ఇందులో వెంకీ, మహేష్ కాంబినేషన్, గెటప్‌లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది. ఇక ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లాడుతూ ..25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీస్టారర్ ఇది. వెంకీ, మహేష్ అన్నదమ్ము లుగా నటిస్తున్నారు. సీతమ్మ వాకిలి.. అంటే భారతదేశం, సిరిమల్లె చెట్టు..అంటే కుటుంబం అన్నారు.
సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, రోహిణి హట్టంగడి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: కె.వి.గుహన్, కళ: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.


Click it and Unblock the Notifications











