»   » 'దూకుడు' లో మహేష్ క్యారక్టైరైజేషన్?

'దూకుడు' లో మహేష్ క్యారక్టైరైజేషన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు తాజా చిత్రం 'దూకుడు' లో ఆయన పాత్రని విభిన్నంగా తీర్చిదిద్దుతున్ననంటున్నాడు శ్రీను వైట్ల. అలాగే ఆ పాత్ర లక్షణాలు చెబుతూ..శకునాలూ చూసుకొని యుద్ధరంగంలో దిగడం వీరుడి లక్షణం కాదు. 'దూకుడు' లో మా హీరో అంతే. చేద్దాం, చూద్దాం... అంటూ రేపటికి వాయిదా వేయడం అంటే ఏమిటో తెలియని మనస్తత్వం అతనిది. అనుకొన్నది మరుక్షణం ఆచరణలో పెట్టడమే తెలుసు. శత్రువు బలం, బలగంతో పనిలేదు. ఆయుధం ఉన్నా, లేకున్నా... దూకుడే అతని మంత్రం...అంటున్నారు శ్రీను వైట్ల. మహేష్‌బాబు సరసన సమంత నటిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.వచ్చే నెలలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. ఈ చిత్రానికి గోపి మోహన్ కథను అందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ కేవలం కాసేపు కాకుండా సినిమా అంతటా పోలీస్ గెటప్ లోనే కనిపిస్తాడని చెప్తున్నారు. 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీను వైట్ల మార్కు కామెడీతో పాటు మహేష్ సినిమాల్లో వుండే హై ఓల్టేజ్ యాక్షన్ ఉంటుందని అంటున్నారు.ఈ చిత్రానికి డేరింగ్,డేషింగ్ అనే ట్యాగ్ లైన్ ని పరిశీలుస్తున్నట్లు సమాచారం.

English summary
The makers of Mahesh Babu's new movie Dookudu are considering a tagline 'Daring and Dashing'. Samantha is pairing up with Mahesh in this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu