మహేష్ బాబు వివరణపై మీరే మంటారు? (కామెంట్ ప్లీజ్)
హైదరాబాద్: మహేష్ బాబు నటించిన 'ఆగడు'చిత్రం టీజర్ ఇటీవల విడుదలై వివాదానికి దారి తీసింది. ఈ టీజర్లో మహేష్ బాబు చెప్పిన డైలాగులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి ఉన్నాయనే విమర్శలు వినిపించాయి. అయితే ఈ విమర్శలకు మహేష్ బాబు తెర దించారు.
హైదరాబాద్‌లో జరిగిన ఐడియా స్టూడెంట్స్ అవార్డ్స్ కార్యక్రమానికి హాజరైన మహేష్ బాబు ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆగడు టీజర్‌పై వస్తున్న విమర్శల గురించి మీడియా ప్రశ్నించగా మహేష్ బాబు స్పందించారు. " మేము టీజర్ లో ఎవరినీ టార్గెట్ చేయలేదు. అలాంటి ఇంటెన్షన్ కూడా లేదు. నేను కూడూ దూకుడు లో అలాంటి పంచ్ డైలాగులే చెప్పాను. ఆగడు లో ఈ డైలాగు అక్కడ నుంచి టేకాఫ్ అయ్యింది. ఈ డైలాగు కేవలం ఆ పాత్ర ఏటిట్యూట్ మాత్రమే. వేరే వారి గురించి అన్న ప్రశ్నే లేదు ," అని తేల్చి చెప్పారు.

అసలు 'ఆగడు' టీజర్‌ను మీరు వివాదాస్పదంగా పరిగణిస్తారా? మహేష్ బాబు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఆగడు టీజర్ ఎపిసోడ్‌పై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ బాక్సులో వెల్లడించండి. మీరు చేసే కామెంట్స్ మర్యాద పూర్వకంగా ఉండాలని మనవి. అసభ్యత, అభ్యంతరాలకు తావు లేకుండా ఉన్న కామెంట్స్ మాత్రమే పబ్లిష్ చేయబడతాయి.


Click it and Unblock the Notifications











