బాలీవుడ్ ఎంట్రీ గురించి మహేష్ బాబు
బాలీవుడ్ చిత్రంలో మహేష్ బాబు నటించనున్నాడనే వార్తలు వస్తున్న నేపధ్యంలో మహేష్ ఈ విషయమై క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ... నేను ఇప్పుడున్న పరిస్దితుల్లో బాలీవుడ్ లో అడుగుపెట్టాలంటే రెండు సంవత్సరాలు పడుతుంది. నా చేతిలో ఉన్న ప్రాజెక్టులు పూర్తవటానకి మినిమం రెండు సంవత్సరాలు టైమ్ పూర్తిగా పడుతుంది. అందులోనూ దూకుడు హిట్టైన తర్వాత నా రెస్పాన్సబులిటీ ఇంకా పెరిగింది. అయినా నాకూ బాలీవుడ్ కి ఉన్న ఏకైక కనెక్షన్ నా భార్య నమ్రత శిరోధ్కర్ మాత్రమే. అయినా బాలీవుడ్ లో నేను ఎంట్రీ ఇచ్చేది ప్రోపర్ రోల్ దొరికినప్పుడు మాత్రమే.అంతేగానీ సైడ్ రోల్స్ లో చెయ్యను అన్నారు. ఇక దూకుడు హిందీ వెర్షన్ కి మహేష్ నే తీసుకుందామనుకున్నా మహేష్ ఒప్పుకోలేదని తెలుస్తోంది.
ఇక బాలీవుడ్ ఎంట్రీ గురించి వచ్చిన వార్తల గురించి చూస్తే... ప్రిన్స్ (వివేక్ ఒబరాయ్) చిత్రంతో పరచయమైన కుకి గులాటి అనే దర్శకుడు ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నాడని ముంబైకి చెందిన ఓ పత్రికలో వచ్చింది. కుకి ప్రస్తుతం శ్రీమతి షిండేతో కలసి తిచా బాప్... త్యాచా బాప్ అనే చిత్రం రూపొందిస్తున్నాడు. ఆ చిత్రం అనంతరం చేయబోయే చిత్రం మహేష్ బాబుది అని రాసుకొచ్చింది ఆ పత్రిక. అలాగే సోబో ఫిల్మ్స్ వారు ఆ చిత్రాన్ని నిర్మించనున్నారని తెలిపింది. ఇక కుకి, మహేష్ బాబు ఓ యాడ్ ఫిలిం షూటింగ్ లో కొద్ది నెలల క్రితమే పరిచయమయ్యారు. అప్పుడు కుకి చెప్పిన ఓ ధ్రిల్లర్ లైన్ విపరీతంగా మహేష్ కు నచ్చటంతో స్క్రిప్టు చేసుకుని కలవమని చెప్పాడని సమాచారం. మొన్న దూకుడు షూటింగ్ సమయంలోనూ ముంబైలో కుకి వచ్చి మహేష్ తో చర్చించి వెళ్లాడని సమాచారం. ఇక ఈ విషయమై కుకి గులాటిని మీడియావారు అడగగా...ఇప్పటివరకూ ఏది ఫైనల్ కాలేదు... ఇంకా ఆ ప్రాజెక్టు ప్రారంభ స్టేజిలో ఉంది.ఇప్పుడు నేను మాట్లాడితే బాగోదు అన్నాడు.


Click it and Unblock the Notifications











