రికార్డులు బ్రద్దలు కొట్టడానికి రెడీ: మహేష్
క్లైమాక్స్ చిత్రీకరణ అనంతరం సినిమా మీద నమ్మకం మరింత పెరిగింది, ఈ చిత్రం అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని తాను ఆశిస్తున్నట్లు మహేష్ ట్విట్టర్ లో తన తాజా చిత్రం గురించి రాసారు. అలాగే..షూటింగ్ జరుగుతున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు తెరకెక్కిస్తున్న క్లైమాక్స్ సన్నివేశాలు నాకు బాగా నచ్చాయి. ఇందులో ప్రకాష్ రాజ్ నటన అందరికీ నచ్చుతుంది. 'అతడు' తర్వాత త్రివిక్రమ్ తో పని చేయడం మరింత ఆనందంగా ఉంది. అతి తొందర్లోనే మంచి సినిమాతో అభిమానుల ముందుకొస్తాను" అంటున్నారు. ఇంకా పేరుపెట్టని ఈ చిత్రంలోని తన పెర్ ఫార్మెన్స్ కూడా అద్భుతంగా నిలుస్తుందని మహేష్ బాబు భావిస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుస్తున్న ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్. ప్రస్తుతం పుణెలో క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతోంది.
మహేష్ బాబు త్రివిక్రమ్ ప్రకాష్ రాజ్ అనుష్క ట్విట్టర్ పూణె mahesh babu athadu trivikram prakash raj twitter anushka


Click it and Unblock the Notifications