మహేష్ పనిచేసే పెళ్లాన్ని కోరుకోవడం లేదు: నమ్రత
ఆయన పని చేసే పెళ్లాన్ని కోరుకోవడం లేదని, భార్య భర్తలిద్దరూ పని చేస్తూ ఉంటే, జీవితంలో ఆనందం మిస్సవుతుందని ఆయన భావిస్తుంటారు అని చెప్పు కొచ్చారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పెళ్లి తర్వాత నేను ఆయనతో ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు. మళ్లీ సినిమాల్లోకి రావాలనే ఆలోచన లేదని, సినిమాలు చేస్తూ ఇటు కుటుంబ గురించి ఆలోచిస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేయడం తన వల్ల కాదని స్పష్టం చేశారు.
మహేష్ తో మీరు లగ్జరీ లైఫ్ గడుపుతున్నారా? అని అడిగిన ప్రశ్నకు నమ్రత సమాధానం ఇస్తూ....ఖరీదైన పార్టీలకు వెలుతూ తరచూ పేజ్ 3 మీడియాలో కనిపించడమే లగ్జరీ లైఫ్ అని మేము భావించడం లేదని, మేము పార్టీ యానిమల్స్ కాదని నమ్రత అన్నారు. ఇంటిలోనే ఎంతో లగ్జరీ లైఫ్ గడుపుతున్నామని వెల్లడించారు.
ఇప్పటి బాలీవుడ్ హీరోయిన్ల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ...దే ఆర్ గుడ్, కానీ వారు ఇలా వచ్చి అలా వెళ్లి పోతున్నారు. ఎక్కువ మంది కేవలం అందాల ఆరబోతకే పరిమితం అవుతున్నారు. మాధురి దీక్షిత్, శ్రీదేవి, కాజల్ లాంటి అందం, టాలెంట్ ఉన్న హీరోయిన్లు ఇప్పడు చాలా అరుదుగా ఉన్నారు అని తెలిపారు.


Click it and Unblock the Notifications











