మహేష్ స్పెషల్ అట్రాక్షన్ తో విజయవాడలో ‘దూకుడు’ వేడుకలు ...!
సూపర్‌స్టార్ మహేష్ హీరోగా సూపర్‌డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో జి.రమేష్‌బాబు సమర్పణలో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర నిర్మించిన బ్లాక్ బస్టర్ 'దూకుడు' విడుదలైన అన్ని కేంద్రాల్లో దిగ్వి జయంగా 50రోజులు పూర్తి చేసు కుంటోంది. 'దూకుడు" చిత్రంతో మళ్లీ తన సత్తాను చాటిన మహేష్‌బాబు 'దూకుడు" సక్సెస్ ను అభిమానులతో కలిసి పంచుకోనున్నాడు. మరోసారి బహిరంగ సమావేశంలో పాల్గొననున్నాడు. 'ఒక్కడు" తర్వాత మహేష్ బాబు పబ్లిక్ ఫంక్షన్ లో పాల్గొనడం ఇదే.
80 ఏళ్ల తెలుగు సినీ చరిత్ర లో అత్యధిక వసూళ్లతో, అత్యధిక కేంద్రల్లో అర్థశతదినోత్సవం జరుపుకుంటూ అన్ని రికార్డుల్ని తిరగరాసిన 'దూకుడు' చిత్రం విజయోత్సవాన్ని ప్రేక్షకుల, అభిమానుల సమక్షంలో ఈనెల 12 సాయంత్రం 5గంటలకు విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో వైభవంగా జరుపు తున్నాం. ఈ ఫంక్షన్‌లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అతిరథ మహారధులతో పాటు 'దూకుడు' చిత్రం యూనిట్ మొత్తం పాల్గొం టుంది. 'దూకుడు' చిత్రానికి అఖండ విజయాన్ని అందించి ఇండిస్ట్రీ నెంబర్ వన్ గ్రాసర్ గా నిలబెట్టిన ప్రేక్షకులకు మా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నామన్నారు ఈ చిత్ర నిర్మాత. అలాగే ఈ చిత్రానికి చక్కటి మ్యూజిక్ అందించిన తమన్ ఈ ఫంక్షన్ లో సంగీతంతో అలరించనున్నాడు..ఈ కార్యక్రమ వేడుకను లైవ్ టెలికాస్ట్ చేయడానికి 'మా"టీవి సాటిలైట్ రైట్స్ సొంతం చేసుకొన్నదని సమాచారం.
ఇప్పటివరకూ 'దూకుడు" రూ.60 నుండి 80 కోట్ల వరకు వసూలు చేసిందని అంచనా. మగధీర చిత్రం రికార్డులను బ్రేక్ చేసిన దూకుడు తెలుగులో ప్రస్తుతం అత్యధిక వసూళ్లు చేపట్టిన చిత్రం. విదేశాల్లోనూ దూకుడు అత్యధిక వసూళ్లు సాధించి మళ్లీ తెలుగు చిత్రాలకు రూపు తీసుకువచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డులు తిరగరాసిన 'దూకుడు" ఫైనల్‌గా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో కొన్ని రోజుల తర్వాతనే తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











