19న దూకుడు సెన్సార్..దర్శక, నిర్మాతలకు స్పెషల్ షో..
ప్రిన్స్ మహేష్ బాబు, సమాంత జంటగా నటించిన చిత్రం దూకుడు. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. ప్రస్తుతం మహేష్ బాబు, పార్వతి మెల్టన్ మద్య చివరి పాట ను రామోజీ ఫిలిం సిటీ లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో చిత్రం షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. దూకుడు చిత్రం సెన్సార్ బోర్డు వద్దకు ఈ నెల 19 న వెళ్లనుంది. సెప్టెంబర్ 22న ఇండస్ట్రీలోని దర్శక, నిర్మాతలకు స్పెషల్ షో చూపించినున్నారు.
సెప్టెంబర్ 23 న ప్రపంచ వ్యాప్తం గా ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. 14 రీల్స్ ఎంటర్తైన్మెంట్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి అంచనాలు భారీ గా ఉన్నాయి. చిత్రం ఆడియో ఇప్పటికే మంచి స్పందన పొందగా, విడుదల అయినా ట్రైలర్స్ కు విశేష జనాదరణ లభిస్తోంది. కేవలం నైజాం ఏరియాలోనే 240 ప్రింట్లతో, అదే విధంగా హైదరాబాద్ లో 70కి పైగా ప్రింట్లతో విడుదల కానుందని సమాచారం.


Click it and Unblock the Notifications











