twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    70 కోట్ల 15 లక్షల సరికొత్త రికార్డు సృష్టించిన ‘దూకుడు’...!

    By Sindhu
    |

    80ఏళ్ళ తెలుగు సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సూపర్ స్టార్ మహేష్ 'దూకుడు" తాజాగా మరో అద్భుతమైన రికార్డు సృష్టించింది. మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'దూకుడు". ఇటీవల విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ సందర్భంగా 'దూకుడు" వసూళ్ళ విశేషాలను నిర్మాతలు రామ్, గోపీ, అనిల్‌లు తెలియజేస్తూ ' కేవలం 2 వారాల్లోనే 'దూకుడు" 70 కోట్ల 15 లక్షలకు పైగా గ్రాస్ సాధించి ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించింది.

    ఈ సందర్భంగా మా చిత్రానికి ఇంత భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడానికి ఈ నెల 7 నుంచి 9 వరకు శ్రీను వైట్లతో పాటు చిత్రంలోని కొందరు నటీనటులు,సాంకేతిక నిపుణుల చేత రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో విజయయాత్ర నిర్వహిస్తున్నాం" అని తెలిపారు. 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బేనర్ నిర్మించిన 'దూకుడు" అన్ని కేంద్రాల్లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో మూడో వారంలోకి ఎంటరైంది.

    English summary
    Dookudu’ created new records in the history of 80 years of Telugu Film Industry. The film collected gross amount of Rs 70 crores 15 lacs in just two weeks and created all time industry record. Marking this victory director Sreenu Vaitla along with few artists and technicians is planning a victory tour on October 7th, 8th and 9th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X