దేశ, విదేశాల్లోనూ ‘దూకుడు’ నిర్మాత వ్యూహం సక్సెస్...!?
తన ప్రభంజనం తో ఓపెనింగ్ కలెక్షన్స్ కి కొత్త నిర్వచనం ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు హై వోల్టేజీ కామెడీ ఎంటర్టైనర్ 'దూకుడు" . ఐతే ఈ చిత్రం హవా ఒక్క ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాలేదు. ముంబైలోనూ 'దూకుడు" సినిమా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా 13 థియేటర్ లలో విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. ముంబైలో ఇంతకు ముందు ఓ తెలుగు సినిమా 10 థియేటర్ లలో మాత్రమే రిలీజ్ అవటం మనం చూసాం. దూకుడు మాత్రం చరిత్రను తిరగరాసి ముంబైలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. అంతే కాదు నాగపూర్, పూనేలలో కూడా ఈ చిత్రం పలు సినిమా హల్ల్స్ లో సందడి చేస్తుంది.
ప్రారంభపు వసూళ్ళలో విదేశీ బాక్స్ఆఫీస్ ల వద్దా తన సత్తా చాటుతూ ప్రపంచవ్యాప్తంగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఒక్క అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక్క మిలియన్ డాలర్లు పైగా వారాంతపు వసూళ్ళు చేసి లక్ష్యాన్ని అధిగమించింది. అంతేకాదు, బ్రిటన్, ఆస్ట్రేలియా, దుబాయ్, కెనడా, కువైట్ మరియు ఇతర ప్రాంతాలలో కూడా కలెక్షన్స్ లో రికార్డ్స్ బద్దలు కొడుతుందని రిపోర్ట్ వస్తున్నాయి.
లోకల్ రీ-సెన్సార్ కారణంగా సింగపూర్ లో ఈ మూవీ సెప్టెంబర్ 30న విడుదలైంది. అక్కడకూడా అద్భుతమైన బుకింగ్స్ రిపోర్ట్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో తెలుగు టాప్ హీరోస్ నటించిన చిత్రాలు, బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయవంతం కాలేదు. 'దూకుడు" తరహా విజయాలు మరికొన్నిసొంతం చేసుకుంటే సౌత్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానం పదిలంగా ఉంటుంది. మొదటివారంలోనే ఈ సినిమాను సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి మంచి లాభాలు పొందాలన్న నిర్మాతలు వ్యూహం సక్సెస్ అయింది.


Click it and Unblock the Notifications











