నందమూరి హీరోలకు ధీటు గా తొడగొట్టిన మహేష్ బాబు...!
దూకుడు లో మహేష్ బాబు డైలాగ్స్, నటించిన సన్నివేశాలు, పండించిన హాస్యం నటుడిగా ఆయన సామర్ద్యాన్ని ఇనుమడింప చేసాయి. తెలంగాణా స్టైల్ లో మహేష్ బాబు డైలాగ్ డెలివరీ సూపర్బ్ గా వుందంటూ ప్రేక్షకులు డైలాగ్స్ కి ఫ్లాట్ అయిపోతున్నారు..మచ్చుకు మీకోసం కొన్ని డైలాగ్స్... మహేష్: "చూశావా? పంచ్ పడేసరికి ప్రొఫెషన్ చెప్పేశావ్.? " 2. పడుకున్న పులినీ, పని చేసుకునే పోలీసునీ కెలికితే..... వేటే" 3. "పరిస్థితులేంటి సార్.. ఇలా పగబట్టేశాయ్?", 4. "దూకుడు లేకపోతే పోలీస్ కీ పోస్ట్ మ్యాన్ కీ తేడా ఏం ఉంటదీ?",5. "నేను నరకటం మొదలెడితే నరకం లో హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టుకోవాలి ", 6. కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. 7. నాకు ఒక్క నిమిషం ఇస్తే ఆలోచిస్తా, రెండు నిమిషాలు ఇస్తే యాక్షన్ లోకి దిగుతా, మూడు నిమిషాలు ఇస్తే ముగించేస్తా...! 8. భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాదీ..! 9. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోవటమే..
బాలకృష్ణ, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, కళ్యాణ్ రామ్… ఇప్పుడు ఈ జాబితాలో మహేష్ బాబు చేరాడు. ఇదేం జాబితా అనిపిస్తుందా.. నందమూరి వంశం ట్రేడ్ మార్క్ జాబితా. ఇంతకీ వీళ్లంతా చేసిన కామన్ పనేంటో తెలుసా తొడ కొట్టడం. గతంలో మహేష్ బాబు కూడా ఫ్యాక్షన్ సినిమా (ఒక్కడు) చేసిన అందులో ఆయన సిటీ కుర్రాడు కావడం వల్ల తొడ కొట్టలేదు.
అయితే, శ్రీను వైట్ల ఆ పనిచేయించాడు. తన ట్రేడ్ మార్క్ కామెడీలో భాగంగా శ్రీను వైట్ల తప్పకుండా పెట్టే సీను తాగుడు సీను. ఇందులో వెంకీ సినిమాలో, ఢీ సినిమాలో, దుబాయ్ సీనులో తాగుడు సీన్లు సూపర్ హిట్టు. ఇప్పుడు ఆయన తాజా చిత్రం దూకుడులోనూ తాగుడు సీను కంటిన్యూ చేశాడు. విలన్లతో ఓ డీల్ కుదరక (ఉద్దేశంగా) గొడవపడతారు. ఆ సందర్భంగా తాగకుండానే కిక్కెక్కిన మహేష్ బాలయ్య బాబు ని ఇమిటేట్ చేస్తూ "కార్లోవచ్చినా సరే.. కాలినడకనొచ్చినా సరే.. డే టైం వచ్చినా సరే.. నైట్ టైం వచ్చినా సరే.. ఎప్పుడయినా సరే ఎక్కడయినా సరే... ఆఆఅయ్య్య్య్య్య్.." అని తొడగొట్టే సీన్. అదిరిపోయిందంటున్నారు ప్రేక్షకులు. నందమూరి హీరోలకి ధీటుగా శ్రీనువైట్ల మహేష్ చేత చెప్పించారంటున్నారు థియేటర్స్ లో పండగ చేసుకొటున్నారు ఫ్యాన్స్.


Click it and Unblock the Notifications











