దర్శకుడికి కలిసొచ్చిన ‘డీ’ హౌస్ లో మహేష్..!?
మహేష్ యమ 'దూకుడు' గా విజయం కోసం శరవేగంగా సిద్దం అవుతున్నాడు. ఇటివల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి స్పందన రావటం తో చిత్ర యూనిట్ ఉత్సాహంగా సినిమాను పూర్తిచేసే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. దర్శకుడు శ్రీను వైట్లకు కలిసొచ్చిన 'డీ' హౌస్ లో ప్రకాష్ రాజ్ తదితరులు పాల్గొనగా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ జూన్ 20 వరకు కొనసాగుతుందని సమాచారం.
మహేష్ తో సమంతా జోడి కడుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతకం ఫై అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. తమన్ తోలిసారి మహేష్ సినిమాకు పాటలు అందిస్తున్నాడు. దూకుడు గతంలో టర్కీ, గుజరాత్, ముంబై, స్విట్జర్లాండ్ లలో షూటింగ్ జరుపుకుంది. మహేష్ పోలీసు ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కృష్ణ ప్రొడక్షన్స్ సమర్పిస్తుంది.


Click it and Unblock the Notifications











