దూకుడు ఓ రేంజ్ లో ఉంటే చాలు బాక్స్ బద్దలే...
మహేష్ బాబు 'పోకిరి" క్రియేట్ చేసిన రికార్డులను 'మగధీర" తుడిచిపెట్టేసినందున మహేష్ బాబు సినిమా విడుదలవుతున్నప్పుడల్లా..ఈ సినిమా 'మగధీర" ను మించుతుందా?అనే చర్చ సహజంగానే మొదలవుతోంది. 'మగధీర" తర్వాత మహేష్ బాబు నటించగా విడుదలైన ఒకే ఒక్క సినిమా 'ఖలేజా". ఈ చిత్రం విడుదల సందర్భంగా కూడా ఇటువంటి చర్చలే జోరుగా జరిగాయి. ఇప్పుడు 'దూకుడు" విడుదలను పురస్కరించుకుని కూడా మళ్ళీ అవి మొదలయ్యాయి.
మహేష్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న స్టార్ డమ్ కి ప్రస్తుతం అతనికున్న క్రేజ్ కి..అతను నటించే సినిమా 'పోకిరి" రేంజ్ లో ఉండాల్సిన పనిలేదు. 'అతడు",రేంజ్ లోనో, 'ఒక్కడు" రేంజ్ లోనో ఉంటే చాలు..రికార్డులు తిరగరాసేంతగా దున్నేస్తుంది. కనీసం 'మురారి"రేంజ్ లో ఉన్నా చాలు..ఇతర హీరోలకు ముచ్చెమటలు పట్టిస్తుంది. అందువల్ల 'దూకుడు" సినిమా ఏమాత్రం బాగున్నా 'మగధీర"ను మించిపోవడం మంచినీళ్లప్రాయమే అవుతుంది. మరి మహేష్ బాబు 'మగధీర"ను మించుతాడా?


Click it and Unblock the Notifications











