twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ 'దూకుడు' సెన్సార్ కట్స్ ఇవే...

    By Srikanya
    |

    మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో విడుదలైన దూకుడు చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెన్సార్ కట్స్ ఇలా ఉన్నాయి. అయిదుగురు సభ్యులతో కూడిన 'ఇసి' 'దూకుడు' చిత్రాన్ని చూసి 10 కట్స్‌తో తలిదండ్రుల నిర్దేశకత్వంలో చూడాలంటూ 'యుఎ' సర్టిఫికెట్‌ 21.9.11న జారీ చేసింది.

    రెండవరీలులో:
    1) 'బాడ్‌కోవ్‌' అనే మాటను తొలగించారు.

    2) ఎరుపు నలుపు చెక్స్‌ గల డ్రెస్‌ వేసుకున్న హీరోయిన్‌ పాటలో కూర్చొనే దృశ్యంలోని క్లీవేజ్‌ షాట్స్‌ కత్తెరపాలయ్యాయి.

    3) 'బొంగు' పదాన్ని కత్తిరించారు

    4) మూడవ రీలులోని చిత్రీకరణలో దర్శకుడు అన్న ''నీ యెబ్బ'' మాటలు కత్తెర పాలయ్యాయి.

    5) నాలగవ రీలులో ఐరన్‌ బ్లాక్‌పై తలను కొట్టుకునే దృశ్యాలు తొలగించారు.

    ఏడవరీలులో:
    6) పాటలో హీరోయిన్‌ పిరుదులను హీరో నొక్కే దృశ్యాలు తొలగించారు.

    7) 'దొంగ నా కొడకా' పదాలు కత్తిరింపుకు గురి అయ్యాయి.

    8) నోటిలోకి బాటిల్‌ని నొక్కే దృశ్యాలు తొలగించారు.

    9) తలలోకి రాడ్‌ దూసుకుపోయే దృశ్యాలు కత్తెరపాలయ్యాయి.

    10) 8వ రీలులో షాయాజీ షిండే అన్న 'బాస్టర్డ్‌' పదం తొలగింపుకు గురి అయింది.

    4711.52 మీటర్ల నిడివిగల 'దూకుడు' 23.9.11న విడుదలైంది. మహేష్‌ బాబు, సమంత, ప్రకాశ్‌రాజ్‌, కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్‌, తనికెళ్ళ భరణి, సోనూసూద్‌, సాయాజే షిండే, వెన్నెల కిశోర్‌, పార్వతి మిల్టన్‌, సుధ, ప్రగతి, సోనియా నటించిన చిత్రం 'దూకుడు'. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాన రామ్‌ ఆచంట, గోపిచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మించిన ఈ చిత్రానికి రచన దర్శకత్వం శ్రీను వైట్ల.

    English summary
    This year's biggest hit Dookudu has get censor certificate with few cuts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X