సెట్రల్ జైల్లో మహేష్‌బాబు 'దూకుడు' ...లేటెస్ట్ ఇన్ఫో
మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'దూకుడు'. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్ పూర్తి చేసుకుంది. అక్కడి సెంట్రల్ జైలు సెట్లో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. త్వరలో విదేశాల్లో మరో పాటని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ...''మహేష్‌బాబు పాత్ర చిత్రణ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆయన హావభావాలు, మాట్లాడే విధానం అభిమానులకు తప్పకుండా నచ్చుతాయి. శ్రీను వైట్ల మహేష్‌ని ఓ కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సమంత పాత్ర కూడా కీలకమే. షూటింగ్ చివరి దశకు చేరుకొందని అన్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మాతలు. ఈ చిత్రంలో మహేష్ ..పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి గోపి మోహన్ కథను అందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ కేవలం కాసేపు కాకుండా సినిమా అంతటా పోలీస్ గెటప్ లోనే కనిపిస్తాడని చెప్తున్నారు. 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీను వైట్ల మార్కు కామెడీతో పాటు మహేష్ సినిమాల్లో వుండే హై ఓల్టేజ్ యాక్షన్ ఉంటుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











