»   » ప్రిన్స్ మరియు యంగ్ టైగర్ ముంబైలో...

ప్రిన్స్ మరియు యంగ్ టైగర్ ముంబైలో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'శ్రీను వైట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. అతనెంత కష్టపడ్డాడో నాకు తెలుసు. దూకుడు షూటింగ్ ఒక పిక్నిక్‌లా సాగింది. షూటింగ్ జరిగిన 9నెలలు చాలా ఆనందంగా గడిపాను. శ్రీను వైట్ల నాన్న గారికి పెద్ద అభిమాని. ఆ అభిమానంతో 'దూకుడు" లాంటి మంచి సినిమా నాకు అందించినందుకు శ్రీను వైట్లకు జీవితాంతం రుణపడి వుంటాను" అన్నారు మహేష్. రీసెంట్ గా ఆడియో విడుదల కార్యక్రమం పూర్తి చేసుకొన్న'దూకుడు" ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణ కోసం ముంబై వెళ్లింది. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాల షూటింగు ముంబైలో జరుగుతోంది. మహేష్ బాబు, సమంతా హీరో హీరోయిన్లుగా శ్రీను వైట్ల డైరెక్షన్లో రూపొందుతున్న 'దూకుడు' సినిమా షూటింగు నిన్నటి నుంచి ముంబైలో జరుగుతోంది. ఇప్పటికే కొన్నిసార్లు ఈ సినిమా షూటింగు ముంబైలో జరిగిన విషయం మనకు తెలిసిందే.

కాగా, ఈ సినిమాతో బాటుగా జూ ఎన్టీఆర్ హీరోగా, తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న సినిమా షూటింగు కూడా నేటి నుంచి ముంబైలో జరుగుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 'ఊసరవెల్లి' సినిమా షూటింగు ముంబైలో చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ దృశ్యాలను బ్యాంకాక్ లో చిత్రీకరించారు. ప్రస్తుతం ముంబాయ్ లో ఊసరవెల్లికి సంబంధించిన ఇంట్రడ్యూసింగ్ సాంగ్ చిత్రీకరణ కోసం ముంబై వెళ్లినట్టు సమాచారం.

English summary
Mahesh Babu's Dookudu and Jr Ntr's Oosaravelli are currently being shot in Mumbai. While Oosaravelli will be completing an introduction song on Jr Ntr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu