మహేష్ దూకుడికి మైనస్ కంటే ప్లస్ లే ఎక్కువ....!?
ప్రేక్షకులు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'దూకుడు" మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. మొన్న సెన్సార్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రానకి డిఐ ప్రింట్స్ సెన్సార్ జరిగింది. సినిమా ఎక్స్ లెంట్ గా ఉందని సెన్సార్ రిపోర్ట్ రావడంతో మహేష్ ఫ్యాన్స్ చాలా హ్యాఫీగా ఉన్నారు. పోకిరి తర్వాత దూకుడు మరో బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఇప్పటికికే ఆడియో హిట్ కావడంతో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.
మహేష్ బాబు, సమంత, జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ 'దూకుడు" చిత్రం ఈ నెల 23న విడుదలకానున్న విషయం విధితమే. ఈ సినిమా గురించి కొన్ని ప్లస్ లు, మైనస్ లు గురించి పరిశ్రమలో ఈ విధంగా ఓ టాక్ ప్రచారం అవుతోంది. ఆ సంగతులలేంటో చూసేద్దామా...
ప్లస్ పాయింట్స్: మ్యూజిక్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ట్రైలర్స్ అంచనాలు పెంచుతన్నాయి. ఎక్కువ థియేటర్స్ లో విడుదలవ్వడమే కాకుండా భారీ ఓపెన్సింగ్ తెచ్చుకునే అవకాశం దక్కించుకుంటోంది. ఇండియాలో కాకుండా ఇతర దేశాలలో సైతం ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వటం. యుఎస్ లో 75థియేటర్స్ లో ఈ సినిమా విడుదలవుతోంది. ఈ చిత్రం విడుదల సమయంలో మరే హీరో చిత్రం విడుదల కాకపోవడం..దసరా వరకూ మహేషే ప్రిన్స్....ప్రిన్సే మహేష్....అందాల సమంత గ్లామర్ మహేష్ దూకుడుకి అదనపు ఆకర్షణ అవుతుందని, ఫ్యామిలీ, క్లాస్, మాస్, యూత్ ని థియేటర్స్ కి రప్పించగలడు. శ్రీనువైట్ల మార్క్ కామెడీ ప్లస్ యాక్షన్.
మైనస్ పాయింట్స్: శ్రీను వైట్ల గత సినిమాలతో ఈ సినిమాని పోల్చుతారు. తెలంగాణా ఉద్యమం వల్ల సినిమాకి ఇబ్బందులు ఎదుర్యే అవకాశం. సెకండాఫ్ లో కాసేపు సినిమా స్లోగా సాగడం. కానీ ఫైనల్ వర్డ్ ని తీసుకుంటే మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధిస్తుందనే టాక్ ఉంది.


Click it and Unblock the Notifications











