For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కామి'ఢీ'తో రెడీ ('దూకుడు' ప్రివ్యూ)

  By Srikanya
  |

  అజయ్(మహేష్ )కి దూకుడెక్కువ. ఏ నిర్ణయమైనా క్షణాల్లో తీసుకోవాల్సిందే. అలా తీసుకున్న నిర్ణయం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. వృత్తి తర్వాత ఎక్కువగా ఇష్టపడేది తన కుటుంబాన్ని. అతని జీవితంలోకి ప్రశాంతి(సమంత) ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెర మీద చూడాల్సిందే. నమో వెంకటేశ చిత్రంతో పరిచయమైన నిర్మాతలు రెండో సారి కూడా శ్రీను వైట్లనే నమ్ముకుని చేస్తున్న ఈ ప్రయత్నం కంటిన్యూ నవ్వుల్లో ముంచెత్తటం ఖాయం అంటున్నారు. నమో వెంకటేశ చిత్రంతో ప్లాప్ స్లాట్ లోకి వెళ్లిన శ్రీను ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టి తెలుగులో తన స్దానాన్ని పదిలపరుచుకోవాలనే కృత నిర్ఛయింతో ఉన్నాడు. అలాగే మహేష్ సైతం చాలా కాలంగా హిట్ టాక్ కి మొహం వాచి ఉన్నాడు. అతను సైతం ఈ సారి చాలా కాన్ఫిడెంట్ గా ఈ చిత్రంతో హిట్ కొడతాననే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ అజయ్ అనే ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. సిన్సియర్, కోపం కలిసిన ఈ పోలీస్ అధికారి... ప్రశాంతి(సమంత)తో ప్రేమలో పడతాడు. మరో పక్క తన తండ్రి ప్రత్యర్దుల చేతిలో దెబ్బతిని ఉంటాడు. దాంతో వారిపై రివేంజ్ తీర్చుకోవాలనకుని ఆయనకు ఉపశమనం కలిగించాలనుకుంటాడు. అందుకోసం అజయ్ ఏం చేసాడు అనేది కామిడీతో కలగపిన యాక్షన్ స్టోరీ. ఇక వినాయికుడు పేమ్ సోనియా ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రను పోషిస్తోంది.అలాగే రక్త చరిత్ర ఫేమ్ అభిమన్యు సింగ్ విలన్ గా కనపించి అలరిస్తాడు. బ్రహ్మానందం సినిమా చివరి దాకా ఉండి నవ్వులు పండిస్తాడు. అలాగే ఈ చిత్రంలో డైలాగులుకు ప్రత్యేకమైన శ్రద్ద పెట్టి రాసారు. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా, భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాది వంటి డైలాగులు అభిమానులు చేత టప్పట్లు కొట్టిస్తాయంటున్నారు.ఎప్పట్లాగే మాస్టర్ భరత్ ఈ చిత్రంలో ఓ విచిత్రమైన పాత్రలో కనిపించి నవ్వించనున్నారు.

  చిత్రం: దూకుడు

  బ్యానర్: 14 రీల్స్ ఎంటర్టైనమెంట్స్ష్

  నటీనటులు: మహేష్ బాబు, సమంత, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సోనూసూద్, ధర్మవరపు సుబ్రమణ్యం, మాస్టర్ భరత్, ఎమ్ ఎస్ నారాయణ తదితరులు.

  కథ: గోపీ మోహన్

  మాటలు: కోన వెంకట్

  కెమెరా: కె వి గుహన్

  ఎడిటింగ్: ఎమ్ ఆర్ వర్మ

  సహ నిర్మాత: రమేష్ బాబు

  సమర్ఫణ: కృష్ణ ప్రొడక్షన్స్ ప్రెవేట్ లిమిటెడ్

  సంగీతం: తమన్

  నిర్మాతలు: ఆచంట గోపీచంద్, ఆచంట రామ్ & అనీల్ సుంకర

  స్క్రీన్, దర్శకత్వం: శ్రీను వైట్ల

  English summary
  Mahesh Babu film Dookudu releasing today.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X