twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వికిపీడియాలో 'దూకుడు' రికార్డులు

    By Srikanya
    |

    ప్రపంచమంతా ఆసక్తిగా ఏ అంశం కోసమైనా చూసే వికిపీడియాలో దూకుడు చిత్రానికి సంభందించి రికార్డులతో సైతం వివరాలు పొందుపరిచారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంిచారు. గా 1600 దియోటర్స్ లో విడుదల చేసారని, హైదరాబాద్ లో 71 స్క్రీన్స్ లోనే విడుదల చేసారని రాసుకొచ్చారు. అలాగే.. మా టీవీ వారు 5 కోట్ల నలభై లక్షలకు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ పొందారని రాసారు. అలాగే ఈ చిత్రం ఏయే దేశాల్లో విడుదల అయ్యిందో ఆ వివరాలు తెలియపరిచారు. అంతేగాక ఈ చిత్రానికి సిఎన్ ఐబిన్ వారు మూడున్నర రేటింగ్ ఇచ్చి రివ్యూ రాసారని, అలాగే మరికొన్ని రివ్యూలను, రేటింగ్ లను ప్రస్తావించారు. సినిమా శ్రీను వైట్ల బ్రాండ్ తో కూడిన కామిడీ అని, అలాగే దుకుడు చిత్రం ఎంతెంత ఎక్కడ కలెక్టు చేసిందో వివరంగా రాసుకొచ్చారు. ఇప్పుడా పేజి మహేష్ అభిమానులు ఒకరికి ఒకరు లింక్ లు పంపుకుంటున్నారు. ఇక ఈ చిత్రం యాభై రోజుల పంక్షన్ ని గ్రాండ్ గా చెయ్యాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. విజయవాడలో నవంబర్ 11 లేదా 12 తేదిల్లో ఈ పంక్షన్ జరపాలని ప్లాన్ చేస్తున్నారు.మరో వారంలో ఈ డేట్ ని ఫిక్స్ చేస్తారు.

    ఆ రోజు మహేష్ పంక్షన్ కి రావాలి కాబట్టి ది బిజెనెస్ మ్యాన్ షెడ్యూల్ ని బట్టి డేట్ ఫిక్స్ అవుతుంది. ఇక ఈ పంక్షన్ కి లక్షల్లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ హాజరు అవుతారని చెప్తున్నారు. అలాగే ఈ పంక్షన్ కి రావటానికి మహేష్ కి ప్రత్యేకమైన హెలీకాప్టర్ ని ఎరేంజ్ చేసే ఆలోచనలో ఉన్నారు నిర్మాతలు. ఇక దూకుడు ఓ రేంజి కలెక్షన్స్ తో దుమ్ము రేపుతోంది.. ప్రతీ రోజు మీడియాలో వీటికి సంభందించిన వార్తలు వస్తున్నాయి. అయితే వాటిని కొందరు కావాలని హైప్ క్రియోట్ చేస్తున్నారని కొట్టిపారేస్తున్నారు. అయితే మహేష్ తాజాగా తన ట్విట్టర్ లో రాస్తూ.. ఇది అపీషయల్.. దూకుడు తెలుగు ఇండస్ట్రీలో హైయిస్ట్ గ్రాసర్.. అన్ బిలీవబుల్ అని ట్వీట్ చేసారు. ఇక యాక్షన్ కలగలిపిన ఫ్యామిలీ సినిమాగా ఈ చిత్రం అన్ని వర్గాలని ఆకట్టు కోవటంతో దాదాపు అందరూ మొదటి రెండు వారాల్లోనే ఈ చిత్రాన్ని చూడటానికి ఆసక్తి చూపించారు.

    English summary
    Wikipedia says...The film had the largest worldwide opening for a Telugu film, releasing globally in 1600 screens, including 71 screens in Hyderabad, India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X