దూసుకుపోతున్న ‘దూకుడు’ గ్రాస్ 61.9కోట్లు...!

By Sindhu

తెలుగు సినిమా నిర్మాణ వ్యయం సాధారణంగా ఒక్కో సినిమాకు రూ.7 నుండి 40 కోట్ల మధ్య ఉంటుంది. రిలీజుకి ముందు పేరున్న చిత్రాలకి రూ.12 నుండి 60 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. సినిమా విజయం సాధిస్తే రూ.60 నుండి 90 కోట్ల వరకు వ్యాపారం జరగవచ్చు. ఇంత ఘనమైన చరిత్ర కలిగిన మన టాలీవుడ్‌ కు ఈ మధ్యనే 80 సంవత్సరాలు నిండాయి. కలెక్షన్లలో ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులు నమోదు అవ్వడం సహజమే. ఎందుకంటే టిక్కెట్టు రేట్లు కూడా ఎప్పటికప్పుడు పెరిగిపోవడం కూడా కొన్ని చిత్రాలకు కలిసొచ్చే అంశం. ఇండస్ట్రీ గర్వపడే స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టే దర్శకులు వేళ్లమీద లెక్కపెట్టుకునేవారే కనిపించడం గమనార్హం.

రీసెంట్‌గా మహేష్‌బాబు నటించిన 'దూకుడు" చిత్రం తొలివారం రోజుల్లోనే రూ.50 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు సాధించి దూసుకుపోతోంది. టాలీవుడ్ రికార్డుల్ని తిరగరాస్తోన్న 'దూకుడు" తాజాగా మరో సరికొత్త రికార్డుని నమోదు చేసింది. పది రోజులకుగాను 'దూకుడు" గ్రాస్ 61.9కోట్లకు చేరుకుంది. తొలి రోజు, తొలి వారం రికార్డుల పరంగా చెప్పుకోవాల్సి వస్తే, ఇప్పటికే టాలీవుడ్ లో వున్న రికార్డుల్ని తుడిచిపెట్టిన 'దూకుడు", సరికొత్త రికార్డుల్ని నమోదు చేసిన విషయం విదితమే. దసరా సీజన్ కావడం..ఇంకో సినిమా ఏదీ బరిలో ఇప్పటిదాక లేకపోవడం..అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కామెడీ ఎంటర్ టైనర్ కావడం..వెరసి దూకుడు" ప్రభంజనానికి అడ్డే లేకుండా పోయింది. 'ఊసరవెల్లి" విడుదలయ్యాక పరిస్థితి ఎలా వుంటుందోగానీ, ప్రస్తుతానికైతే 'దూకుడు" హవాకి అడ్డుకట్ట పడే అవకాశలే కన్పించట్లేదు. ఇదే జోరు ఇంకో పది పదిహేను రోజులు కొనసాగితే, వసూళ్ళ పరంగా టాలీవుడ్ లో ది బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంటుంది దూకుడు.

జూ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'ఊసరవెల్లి" ఈ నెల 6న విడుదలవుతున్న సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X